సంగీత దర్శకుడు థమన్ లో ఇంకా ఓ చిన్న పిల్లాడు దాగున్నాడేమో? చిన్నతనంలోనే కష్టాలు పడి, బాల్యం కన్నా బాధ్యతలను ఎక్కువ మోయడం వల్లనేమో ఇప్పుడు సదా జీవితాన్ని సరాదాగా గడపాలని చూస్తుంటారు.
క్రికెట్ ఆడని రోజు లేదు. ఈ మధ్య కొత్తగా షో లు కూడా చేస్తున్నారు. అంతా బాగుంది. కానీ సమస్య ఒకటే. వీటిల్లో పడి వర్క్ ను నిర్లక్ష్యం చేయరు కానీ ఆలస్యం చేస్తున్నారని కామెంట్లు వున్నాయి.
ఈ మాట ఎలా వున్నా, నిన్నటికి నిన్న థమన్ ను ఓ సినిమా వర్క్ గురించి క్రికెట్ మధ్యలో ఆపించి తీసుకు రావాల్సి వచ్చింది. సినిమా వర్క్ పెండింగ్ వుంది. థమన్ కావాలి. ఎక్కడ వున్నారు అంటే ఎక్కడో సుదూరంగా క్రికెట్ ఆడుకుంటున్నారు అని టాక్. దాంతో వెళ్లి వెదికి పట్టుకుని, బతిమాలి.. బామాలి.. ఆట ఆపించి వెనక్కు రప్పించి, తమ వర్క్ మీద పెట్టుకోవాల్సి వచ్చింది.
థమన్ కు ఆట ధ్యానం వుండడం మంచిదే కానీ ఇప్పుడు కెరీర్ ఫుల్ బూమ్ లో వుంది. ఇలాంటపుడు కొంచెం ఎక్కువ దృష్టి వర్క్ మీద పెడితే థమన్ ను పెట్టుకునే వారు ఇబ్బంది పడరు. లేదంటే థమన్ ను పెట్టుకుంటే ఇబ్బంది అనే మాట పదే పదే పెరిగితే కొన్నాళ్ల తరువాత కెరీర్ కు ఇబ్బందిగా మారుతుంది.
ఇప్పటికే ఫ్యాన్స్ వరకు చూసుకుంటే సోషల్ మీడియాలో థమన్ ను వద్దనే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది గమనించాల్సి వుంది.