రంగబలి..సామజవరగమన..రుద్రాంగి

ఈ మధ్య మూడు సినిమాల ట్రయిలర్లు వచ్చాయి. సినిమాలు రావాలి. చూడాలి. కానీ ఈ మూడు సినిమాల ఖర్చులు చూస్తుంటే మాత్రం చాలా తేడా వుంది. రుద్రంగి… అయిదారు కోట్ల లోపు బడ్జెట్, సామజవరగమన..12…

ఈ మధ్య మూడు సినిమాల ట్రయిలర్లు వచ్చాయి. సినిమాలు రావాలి. చూడాలి. కానీ ఈ మూడు సినిమాల ఖర్చులు చూస్తుంటే మాత్రం చాలా తేడా వుంది. రుద్రంగి… అయిదారు కోట్ల లోపు బడ్జెట్, సామజవరగమన..12 కోట్ల బడ్జెట్, రంగబలి…17 కోట్ల బడ్జెట్.

కానీ మూడు ట్రయిలర్లు మూడు రకాలుగా కనిపిస్తున్నాయి. రుద్రంగి ట్రయిలర్ రిచ్ గా వుంది. రంగబలి ట్రయిలర్ లో కాస్త ఖర్చు కనిపిస్తోంది. సామజవరగమన చిన్న సినిమా లుక్ లో వుంది.

సరే, రంగబలి సినిమాకు శౌర్య హీరో కాబట్టి, నాలుగు కోట్లకు పైగా పారితోషికం లెక్క వేసుకోవాల్సిందే. అంటే ప్రొడక్షన్ కు, మిగిలిన కాస్టింగ్ కు 13 కోట్లు అనుకోవాల్సిందే. ట్రయిలర్ లో కాస్త మేకింగ్ కనిపించింది.

రుద్రంగి కి పెద్దగా కాస్టింగ్ లేదు కనుక కేవలం ప్రొడక్షన్ ఖర్చు జస్ట్ మూడు, నాలుగు కోట్లు అనుకోవాలేమో? కానీ ట్రయిలర్ చూస్తే, జానర్ వల్ల కావచ్చు, ట్రీట్ మెంట్ వల్ల కావచ్చు. రిచ్ నెస్ అనిపిస్తోంది.

సామజవరగమన సినిమా లో శ్రీవిష్ణు హీరో. కోటిన్నర వరకు ఇచ్చి వుంటారు. అంటే ప్రొడక్షన్ కు కేవలం పది కోట్లు అయింది. కానీ ట్రయిలర్ చూస్తే ఆ రేంజ్ కనిపించలేదు. అక్కడ ప్రొడక్షన్ కంట్రొలు తప్పిందనుకోవాలి.

మొత్తం మీద మూడు సినిమాలు ఒక వారం గ్యాప్ లో విడుదలవుతున్నాయి. ఎలా వుంటాయో చూడాలి.