జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రకు తాత్కలికంగా బ్రేక్ ఇచ్చారు. ఆయన జర్వంతో బాధపడుతుండటంతో నేటి నుండి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజులు కూడా భీమవరంలోనే ఆయన బస చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి భీమవరంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
గత ఏడాదే ముచ్చటి పడి ఓ బస్సును యాత్రకు తయారు చేసుకున్న పవన్ కళ్యాణ్.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కారణంగా కొన్ని నెలల పాటు ఆగారు. లోకేష్ పాదయాత్ర రాయలసీమలో పూర్తి అవ్వడంతో ఈ నెల 14 నుండి గోదావరి జిల్లాల్లో పగలంతా నాయకులను కలుస్తూ.. చీకటి పడగానే తన బస్సును స్టేజీగా చేసుకోని బహిరంగ సభలో ప్రసంగిస్తు వస్తున్నారు.
రెండు వారాల గ్యాప్‌లోనే పవన్ అనారోగ్యానికి గురవ్వడంతో జనసైనికులు డీలా పడ్డారు. కాగా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరంలో ఆయన ఎలాంటి కామెంట్ చేస్తారనేది అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఏ మీటింగ్‌లో మాట్లాడిన తన ఓటమి గురించి మాట్లాడుతున్నా ఆయన భీమవరంలోనే మళ్లీ నిలబడి గెలుస్తా అంటూ ఏమైనా శపథం చేస్తారనేది అందరు చర్చించుకుంటున్నారు.
మరోవైపు దాదాపు నాలుగు నెలలు పైగా నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న పండగలు, ఏవైనా ఇంపార్టెంట్ కార్యక్రమలు ఉంటే తప్ప లోకేష్ యాత్ర అగడం లేదు. మొత్తానికి మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చెప్పుకుంటున్న పవన్ తన అనారోగ్యంతోనే యాత్ర అగడం విశేషం.