తను మాట ఇస్తే తప్పను అంటోంది హీరోయిన్ రష్మిక. 'ఛలో' సినిమాలో నటిస్తున్నప్పుడే తన నెక్ట్స్ సినిమాలోనూ నటిస్తానంటూ దర్శకుడు వెంకీ కుడుములకు మాటిచ్చినట్టుగా రష్మిక చెబుతోంది. ఆ మాట మేరకు ఆ దర్శకుడి తాజా సినిమా భీష్మలో నటించినట్టుగా రష్మిక చెబుతోంది. ఇలా తను ఇచ్చే మాట పవర్ ఫుల్ అన్నట్టుగా రష్మిక చెబుతోంది!
ఇక తనతో సినిమాలు చేసే దర్శకులు.. మళ్లీ తననే హీరోయిన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నారని కూడా రష్మిక చెబుతోంది. ఇది తనకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశమని అంటోంది. ఒకవైపు వెంకీకి తనే మాటిచ్చినట్టుగా చెప్పిన రష్మిక, ఇలా తనతో పని చేసే దర్శకులే మళ్లీ తనను కోరుకుంటూ.. తపించిపోతున్నట్టుగా చెబుతోంది.
ఇక జెర్సీ హిందీ రీమేక్ లో హీరోయిన్ గా తన వద్దకు ప్రపోజల్ వచ్చినట్టుగా రష్మిక ఒప్పుకుంది. ఆ సినిమాలో చేయలేకపోయినట్టుగా వివరించింది. తల్లి పాత్ర కావడంతోనే హీరోయిన్ గా రష్మిక ఆ సినిమాకు నో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది.
ఇక తనతో పనిచేసే బ్యాచిలర్ హీరోలు పెళ్లికి రెడీగా ఉండాలన్నట్టుగా కూడా రష్మిక హింట్ ఇచ్చింది. కన్నడలో తను ధ్రువ్ సర్జాతో నటిస్తున్న సమయంలో అతడికి పెళ్లి కుదిరిందని, ఇప్పుడు భీష్మలో నటిస్తున్నప్పుడు నితిన్ పెళ్లి అవుతోందని రష్మిక నవ్వుకొంటూ చెప్పుకొచ్చింది. ఈ సెంటిమెంట్ ను రష్మిక బానే చెబుతూ ఉంది. అలాగే తన తొలి సినిమా కిరిక్ పార్టీ సమయంలో తనకు, ఆ సినిమా హీరో రక్షిత్ కు పెళ్లి కుదిరిన వైనాన్ని మాత్రం ప్రస్తావించలేదు! ఆ పెళ్లి జరగలేదు కదా!