Advertisement

Advertisement


Home > Movies - Movie News

రష్మిక డిమాండ్ అలా వుంది మరి

రష్మిక డిమాండ్ అలా వుంది మరి

సాధారణంగా హీరోల డేట్ లు బట్టి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..ఎప్పుడు క్లోజ్ అవుతుంది అన్నది ఓ ఐడియా వుంటుంది. కానీ నాగ్ చైతన్య సినిమా వ్యవహారం వేరుగా వుంది. 

14 రీల్స్ పతాకం మీద పరుశురామ్ డైరక్షన్ లో సినిమా ప్లానింగ్ లో వుంది. లైన్ చెప్పాడు. అది కథగా మారాలి..ఆ పని నడుస్తోంది. కానీ సినిమా ప్రారంభం కావాలంటే మాత్రం హీరోయిన్ రష్మిక దయ తలచాల్సి వుందట.

ప్రస్తుతం వెంకట్ ప్రభు సినిమా మీద వున్నాడు హీరో నాగ్ చైతన్య. తరువాత సినిమాకు రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. అయితే ఆమె ఎప్పుడు డేట్ లు ఇస్తుంది అన్నదాన్ని బట్టి ఈ సినిమా ఎప్పుడు వుంటుంది అన్నది ఆధారపడి వుంటుందట. 

ఎందుకంటే చైతన్య కాంబినేషన్లను బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు సమంత, సాయి పల్లవి కాంబినేషన్లతో హిట్ కొట్టిన తరువాత ఈ లెక్క బాగా పెరిగింది. వెంకట్ ప్రభు సినిమాలో కూడా బంగార్రాజుతో సక్సెస్ ఇచ్చిన కృతిశెట్టి రిపీట్ అవుతోంది. అందుకే రష్మిక డేట్ ల అలాట్ మెంట్ కోసం వెయింటింగ్ అంట.

ఈ లోగా ఎలాగూ వెంకట్ ప్రభు సినిమా వుంది కనుక దాన్ని ఫినిష్ చేసుకునే పనీ వుంది చైతన్యకు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?