ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిన నేషనల్ క్రష్

నేషనల్ క్రష్ రష్మిక మరో ఘనత దక్కించుకుంది. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కింది. 30 ఏళ్ల లోపు అద్భుతాలు సాధించిన వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్స్ తో ఓ జాబితా రూపొందించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. దీనికి…

నేషనల్ క్రష్ రష్మిక మరో ఘనత దక్కించుకుంది. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కింది. 30 ఏళ్ల లోపు అద్భుతాలు సాధించిన వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్స్ తో ఓ జాబితా రూపొందించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. దీనికి '30 అండర్ 30' అనే పేరు పెట్టింది. ఈ జాబితాలో రష్మికకు చోటు దక్కింది.

జీవితంలో తొలిసారి ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పై తన ఫొటో రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది రష్మిక. తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తన ఫ్యాన్స్ తో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

రష్మిక ఆనందాన్ని విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. చాలా గర్వంగా ఉందంటూ స్పందించాడు. ఎక్కడ్నుంచో వచ్చి ఈ స్థాయికి చేరుకున్నావని, ఇలానే ఎదగాలని, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నాడు.

కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక, ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అదే ఊపులో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఈ క్రమంలో నేషనల్ క్రష్ గా అవతరించింది. రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది. 30 ఏళ్లలోపే ఇలా ఎన్నో ఘనతలు సాధించిన రష్మికను ఫోర్బ్స్ గుర్తించింది.