అప్పుడు రకుల్, ఇప్పుడు రష్మిక.. భలే దొరికారు

ఆమధ్య రకుల్ పై ఓ రకమైన ట్రోలింగ్ నడిచింది. కారు నుంచి దిగుతున్న ఫొటోలో ఆమె వేసుకున్న పొట్టి నిక్కరు కనిపించలేదు. దీంతో ఆమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పైన వేసుకొని,…

ఆమధ్య రకుల్ పై ఓ రకమైన ట్రోలింగ్ నడిచింది. కారు నుంచి దిగుతున్న ఫొటోలో ఆమె వేసుకున్న పొట్టి నిక్కరు కనిపించలేదు. దీంతో ఆమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. పైన వేసుకొని, కింద వేసుకోవడం మరిచిపోయినట్టున్నావ్ అంటూ ట్రోల్ చేశారు. ఇంకొంతమంది కాస్త హద్దుమీరి మరీ కామెంట్ చేశారు. దీంతో విసిగిపోయిన రకుల్, అప్పట్లో ట్రోలింగ్ పై ఘాటుగా సమాధానం కూడా ఇచ్చింది. ఇప్పుడు సేమ్ సిచ్యుయేషన్ రష్మికకు ఎదురైంది.

రీసెంట్ గా ఎయిర్ పోర్టులో మీడియా కంటపడింది రష్మిక. అప్పట్లో రకుల్ ఎలాంటి పొట్టి నిక్కర్ వేసుకుందో, అంతకంటే ఓ అంగుళం చిన్నదే వేసుకుంది రష్మిక. ఇంకా చెప్పాలంటే పైన డ్రెస్ కనిపిస్తోంది కానీ కింద బోడి కాళ్లు తప్ప ఇంకేం కనిపించ లేదు. అంత చిన్న నిక్కరుతో కెమెరాలకు పోజులిచ్చింది రష్మిక. దీంతో నెటిజన్లు మరోసారి రెడీ అయిపోయారు.

అప్పట్లో రకుల్ ట్రోలింగ్ కు గురైన ఫొటోను, ఇప్పుడు రష్మిక తాజా ఫొటోను పక్కపక్కనపెట్టి మరీ తిట్టడం మొదలుపెట్టారు. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత బట్టలేసుకోవడం మరిచిపోయావా అంటూ సెటైర్లు మొదలుపెట్టారు. మరికొందరైతే ఎప్పట్లానే హద్దు మీరి వ్యాఖ్యలు చేశారు.

అయితే రష్మిక మాత్రం రకుల్ గా ఆవేశానికి లోనుకాలేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో ట్రోలింగ్ ను ఫేస్ చేసిన ఈ కన్నడ బ్యూటీ, ఈ ట్రోలింగ్ ను కూడా లైట్ తీసుకుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత రష్మిక తన డ్రెస్సింగ్ స్టయిల్ పూర్తిగా మార్చేసింది.