Advertisement

Advertisement


Home > Movies - Movie News

ముద్దుగుమ్మ చిన్న‌ప్ప‌టి నుంచే సెల‌బ్రిటీ

ముద్దుగుమ్మ చిన్న‌ప్ప‌టి నుంచే సెల‌బ్రిటీ

ముద్దుగుమ్మ ర‌ష్మిక చిన్న‌ప్ప‌టి నుంచే సెల‌బ్రిటీ అని ఇప్పుడిప్పుడే తెలిసి వ‌స్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌ల‌న్నీ అట‌కెక్క‌డంతో జ్ఞాప‌కాల‌ను ఒక్కొక్క‌టిగా ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ చిత్రాల‌తో మంచి హిట్స్ సాధించిన ర‌ష్మిక ఆనందంగా ఉన్నారు. దీంతో అభిమానుల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు బాల్యం తాలూకూ జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుంటున్నారు.

తాజాగా త‌న చిన్న‌ప్ప‌టి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ర‌ష్మిక తన స్థాయి ఏంటో చెప్ప‌క‌నే చెప్పారు. 2001లో ర‌ష్మిక ఫొటో ఓ ప‌త్రిక మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ ఫొటోగా ప్ర‌చురించ‌డాన్ని షేర్ చేశారు. ఇది త‌న తొలి మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ అని ర‌ష్మిక చెప్పుకొచ్చారు. ఆ ప‌త్రిక కోసం దిగిన ఫొటో షూట్ ఇప్ప‌టికీ  గుర్తుకున్న‌ట్టు బాల్యంలోకి ఆమె వెళ్లిపోయారు.

త‌న‌ మామ్ అప్ప‌టి పత్రిక‌ని  దాచిన‌ట్టు ఆనందంగా చెప్పుకొచ్చారు. మీ ప్రేమ‌ని పొందేందుకు ఈ రోజు నేను ఇక్క‌డ ఇలా ఉన్నానంటూ అభిమానుల‌నుద్దేశించి అన్నారు. ఇది త‌న‌ జీవితం అని చెప్పేందుకు సంతోషిస్తున్న‌ట్టు ర‌ష్మిక వెల్ల‌డించారు. అంతేకాదు , త‌న‌ స్నేహితులు, కుటుంబాలు, ఇలా ప్ర‌తి ఒక్క‌రిని ప్రేమిస్తున్నానంటూ ర‌ష్మిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు.

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?