రష్మిక కెరీర్ కు సంబంధించి ఈమధ్య ఓ కీలక మార్పు జరిగింది. ఇన్నాళ్లూ ఆమెతో పాటు ఉన్న ఆమె మేనేజర్, తప్పుకున్నాడు. అతడే తప్పుకున్నాడా లేక రష్మికానే అతడ్ని పనిలోంచి తీసేసిందా అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరో ఊహాగానం కూడా చెలరేగింది.
రష్మికకు తెలియకుండా, ఆమె మేనేజర్ చిన్న స్కామ్ చేశాడట. దాదాపు 70-80 లక్షల రూపాయల మేటర్ అది. దానికి ఆగ్రహించిన రష్మిక, అతడ్ని పనిలోంచి తీసేసిందంటూ కథనాలు వచ్చాయి. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు వచ్చిన అన్ని రకాల ఊహాగానాల్ని ఆమె ఖండించింది.
తామిద్దరం విడిపోవడం వెనక ఎలాంటి గొడవలు జరగలేదని రష్మిక తాజాగా ప్రకటించింది. ఇన్నాళ్లూ ఆరోగ్యకర వాతావరణంలో పనిచేశామని, పరస్పర ఒప్పందంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది.
ఇన్నాళ్లూ తామిద్దరం ప్రొఫెషనల్ గా పనిచేశామని, ఇకపై కూడా విడివిడిగా అంతే హుందాగా పనిచేస్తామని రష్మిక క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తన మాజీ మేనేజర్ తో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తోంది రష్మిక. అటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు తనే మెయిన్ లీడ్ గా రెయిన్ బో అనే సినిమా కూడా స్టార్ట్ చేసింది. ఇలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో, మేనేజర్ కు ఉద్వాసన పలికింది రష్మిక.