చింత సచ్చినా పులుపు చావనట్టు అనే సామెత చందాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి తయారైంది. చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకొని మరీ రెండు చోట్ల పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయిన ఆయనలోని అహంకారం ఇసుమంత కూడా తగ్గలేదు. చివరికి కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ముద్రగడ పద్మనాభంపై తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.
కాపు ఉద్యమంలో ద్వారంపూడి కుటుంబం ఎంతగానో సహకరించిందని.. అలాంటి కుటుంబంపై విమర్శలు చేయడం పవన్‌కు తగదు అంటూ చెప్పడమే తప్పయింది. కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి పెట్టిన భోజనలు, డబ్బులను తిరిగి ఆయనే పంపాలంటూ ముద్రగడకు జనసేన నాయకులు వెయ్యి రూపాయలు మనీ ఆర్డర్లు పంపుతు అవమాన పరుస్తున్నారు.
తాను మాత్రం అందర్నీ తిట్టొచ్చు, ఏమైనా అనొచ్చు కానీ తనను ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే మాత్రం బూతులు తిట్టడం, వెక్కిలి నవ్వులు నవ్వడం పవన్ కళ్యాణ్‌కు కామన్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాల పాటు కాపు సామాజిక వర్గం కోసం పోరాటలు చేసిన ముద్రగడ లాంటి వారినే పవన్ ఇంతగా అవమానిస్తుంటే.. ఇతర కాపు నేతల పరిస్థితి ఏంటో ఆర్ధం అవుతోంది.