Advertisement

Advertisement


Home > Movies - Movie News

10 నిమిషాల పని కోసం వేధించారు - రష్మిక

10 నిమిషాల పని కోసం వేధించారు - రష్మిక

డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించి తన కష్టాన్ని నలుగురితో పంచుకుంది రష్మిక. ఈ సినిమాలో తను మహిళా క్రికెటర్ గా నటించానని, ఆ పాత్ర కోసం తనను రాచి రంపాన పెట్టారని చెప్పుకొచ్చింది. సినిమాలో జస్ట్ ఓ 10 నిమిషాలు మాత్రమే క్రికెట్ సీన్లు ఉంటాయని, వాటి కోసం తనను బాగా ఇబ్బందిపెట్టారని అంటోంది రష్మిక.

"10 నిమిషాల విజువల్స్ కోసం ఏకంగా నాతో 4 నెలలు క్రికెట్ ప్రాక్టీస్ చేయించారు. చాలా దెబ్బలు తగిలాయి. అక్కడితో అంతా అయిపోయిందనుకుంటే షూటింగ్ లో మరో టార్చర్. లొకేషన్ లో ఏకంగా 20 రోజుల పాటు నన్ను ఏడిపించారు. ఓకే పాత్ర కోసం ఆమాత్రం కష్టపడాల్సిందే అనుకున్నాను. కానీ మరీ 10 నిమిషాల కోసం ఇలా చేయడం టూమచ్."

డియర్ కామ్రేడ్ ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన రష్మిక.. ఇలా తను ఫేస్ చేసిన కష్టాన్ని బయటపెట్టింది. అయితే ఇదంతా తను ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పడం లేదని ఇష్టంతోనే చెబుతున్నానని చెప్పుకొచ్చింది. చివరికి డబ్బింగ్ విషయంలో కూడా తనను ఇబ్బంది పెట్టారంటోంది.

"ఈ సినిమా కోసం నాతో 3 నుంచి 4 నెలల పాటు డబ్బింగ్ చెప్పించారు. ఎవరైనా 4 నెలలు డబ్బింగ్ చెబుతారా. వీళ్లు మాత్రం నాతో దాదాపు ప్రతి రోజూ డబ్బింగ్ చెప్పించారు. మొన్న కూడా ఓ డైలాగ్ బాగాలేదని మళ్లీ చెప్పించారు. 20 రోజుల్లో రిలీజ్ ఉందనగా నాతో డబ్బింగ్ చెప్పించారు. అది కూడా సినిమాలో ఓ ఏడుపు సీన్."

ఇలా ఎంత ఇబ్బందిపెట్టినప్పటికీ డియర్ కామ్రేడ్ జర్నీని తను ఎంజాయ్ చేశానని, షూటింగ్ అయిపోయినందుకు చాలా బాధేసిందని అంటోంది రష్మిక. ఈనెల 26న థియేటర్లలోకి వస్తోంది డియర్ కామ్రేడ్ సినిమా.

విదేశం నుంచి కాపీ కాదు.. రీమేక్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?