ఈ మధ్య ఎక్కడ చూసిన తన కుక్క పిల్లతో కనిపిస్తోంది రష్మిక. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి.. ఇలా ఎక్కడికెళ్లినా తన కుక్కపిల్లను మాత్రం వదలడం లేదు. ఆమధ్య ఛార్మి-రష్మిక కలిసి తమ కుక్కలతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత సీనియర్ నటి రాధిక-రష్మిక కూడా కుక్కపిల్లలతో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
రష్మిక పెట్ డాగ్ పేరు ఆరా. మరి ఈ కుక్క పిల్ల రష్మిక వద్దకు ఎలా వచ్చింది? రష్మిక ఎందుకు ఈ కుక్క పిల్లను తీసుకుంది. దీనికి కారణం లాక్ డౌన్ అంటోంది ఈ బ్యూటీ. ఆరాను ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.
“లాక్ డౌన్ అనగానే అది ఎక్కువ రోజులు ఉండదని నేను భావించాను. అందుకే మా తల్లిదండ్రులు ఉన్న కూర్గ్ వెళ్లాలని అనుకోలేదు. హైదరాబాద్ లోనే ఉండిపోయాను. అయితే నేను అనుకున్నట్టు జరగలేదు. లాక్ డౌన్ పెరిగిపోయింది. ఆ ఒంటరితనం నుంచి బయటపడ్డానికి ఆరాను తెచ్చుకున్నాను. అప్పట్నుంచి అదే నాకు లోకమైంది. నేను ఎక్కడికెళ్లినా నాతోనే ఉంటుంది, నాతో ఎంజాయ్ చేస్తుంటుంది.”
ఇలా తన పెంపుడు కుక్క వెనక కహానీని బయటపెట్టింది రష్మిక. మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ కు పరిచయమౌతున్న ఈ బ్యూటీ, తాజాగా ఆ సినిమా షూటింగ్ ను పూర్తిచేసింది. ఇక తెలుగులో ఆమె శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాల్లో నటిస్తోంది.