డేటింగ్ అంటే ఏం చేస్తారు.. రష్మిక అమాయకత్వం

కొంతమంది హీరోయిన్లు డేటింగ్ చేస్తారు. మరికొంతమంది డేట్ కోసం వెయిట్ చేస్తారు. ఇంకొంతమంది డేటింగ్స్ లోనే మునిగితేలుతుంటారు. అయితే రష్మికకు మాత్రం అసలు డేటింగ్ అంటే ఏంటో తెలియదంట. ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్తే…

కొంతమంది హీరోయిన్లు డేటింగ్ చేస్తారు. మరికొంతమంది డేట్ కోసం వెయిట్ చేస్తారు. ఇంకొంతమంది డేటింగ్స్ లోనే మునిగితేలుతుంటారు. అయితే రష్మికకు మాత్రం అసలు డేటింగ్ అంటే ఏంటో తెలియదంట. ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్తే ఏం చేయాలో తెలియదంటోంది ఈ కన్నడ బ్యూటీ.

“రొటీన్ డేటింగ్స్ నాకు తెలియవు. అసలు డేటింగ్స్ కు వెళ్లి ఏం చేస్తారో కూడా నాకు అర్థం కాదు. నా వరకు నేనైతే డేటింగ్ కంటే ఎడ్వెంచరస్ స్పోర్ట్స్ కు వెళ్లడానికి ఇష్టపడతాను. ఇక వర్చువల్ డేటింగ్స్ అస్సలు ఇష్టం ఉండదు.”

ఇలా డేటింగ్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది రష్మిక. ఓ యంగ్ హీరోతో ఈ బ్యూటీ చెట్టపట్టాలేసుకొని తిరుగుతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేటింగ్ పై రష్మిక ఇలా రియాక్ట్ అవ్వడం అందరూ కామెడీగా ఫీల్ అవుతున్నారు.

ఇక తన గ్లామర్ పై కూడా స్పందించింది రష్మిక. ఇక్కడ కూడా కాస్త వెరైటీగానే రియాక్ట్ అయింది. కరోనా టైమ్ లో ఈమెకు గ్లామర్ పెరిగిందట. “ఈ కొవిడ్ టైమ్ లో ఎక్కువగా ఇంట్లోనే ఉన్నాను. దీంతో ముఖానికి మేకప్ వేయాల్సిన అవసరం రాలేదు. మేకప్ ఎప్పుడైతే వేయకుండా ఉంటామో ఆటోమేటిగ్గా నిగారింపు వస్తుంది. అలా నా గ్లామర్ పెరిగింది.” అంటూ చెప్పుకొచ్చింది.

ఈ ఎండాకాలం చర్మాన్ని కాపాడుకునేందుకు పెద్దగా ప్రయోగాలు చేయనని, కేవలం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే వాడుతానని అంటోంది రష్మిక.