టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో వున్నది ఇద్దరే. ఒకరు పూజా, రెండు రష్మిక. పుష్ప తరువాత రష్మిక క్రేజ్ మరీ పెరిగిపోయింది. ఆచి తూచి సినిమాలు ఓకె చేస్తోంది.
బ్యానర్, హీరో, డైరక్టర్ ఈ కాంబినేషన్ అంతా చూసుకుంటోంది. పుష్ప 2 సినిమా చేతిలో వుండగానే తమిళ సూపర్ స్టార్ విజయ్ పక్కన ఓ సినిమా ఓకె చేసింది. అలాగే దుల్కర్ సల్మాన్ సరసన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజయ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరక్టర్. దుల్కర్ సినిమాను స్వప్న దత్ నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు. నిజానికి ఈ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. వర్క్ జరుగుతూ వస్తోంది. ఇప్పటికి హీరోయిన్ పేరు రివీల్ చేసారు.
ఈ లెక్కన చూస్తుంటే రష్మిక మరో రెండు మూడేళ్లయినా డిమాండ్ లో వుండేలా కనిపిస్తోంది. ఇంకా మిడ్ రేంజ్ హీరోలకు రష్మిక అందుబాటులోకి రాలేదు.. టాప్ హీరోల తరువాత ఆమె అటు టర్న్ కావచ్చు.