రవితేజ-సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రావణాసుర. టీజర్ వచ్చింది కానీ యునానిమస్ గా సూపర్ అనే రిపోర్ట్ ను అందుకోలేకపోయింది. అది అలావుంచితే ఇప్పుడు ఓ రీమిక్స్ సాంగ్ వదిలారు. రవితేజ కు ఈ రెట్రోలుక్ అన్నా, పాట అన్నా ఇష్టమేమో. కొన్నాళ్ల క్రితం థమన్ తో ఓ మాంచి పాట చేయించారు.
డిస్కో రాజా అనే సినిమాలో ‘నువ్వు నాతో ఏం అన్నావో’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంటుంది. పిక్చరైజేషన్ ఓకె. ఆ పాటలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఏ గెటప్ లో కనిపిస్తుందో ఇప్పుడు మళ్లీ అదే గెటప్ మేఘా ఆకాష్ కు వేసారు. ఈసారి పాట కొత్త పాట చేయించలేదు. పాత పాట అయిన వేయిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాను…అనే సిరివెన్నెల పాటను మళ్లీ పిక్చరైజ్ చేసారు.
కానీ ధమన్ స్వంతంగా చేసిన ఆ డిస్కోరాజా రెట్రో గీతమే బాగుంది. ఈ పాట అంతగా అతకలేదు.దానికి తోడు వదిలిన వీడియో ఫుటేజ్ లో డ్యాన్స్ బిట్ లు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు. ఇంతకన్నా మంచి క్యాచీ సాంగ్స్ ఇంకా చాలా వున్నాయి. వాటిని ఎన్నుకోవాల్సింది.
అలాగే పిక్చరైజేషన్ కూడా ఇంకా బాగుండేలా చూసుకోవాల్సింది. రవితేజ హెయిర్ స్టయిల్ 80 ల కాలం నాటి మోడల్ కావచ్చు..కానీ ఏదోలా వుంది. శేఖర్ మాస్టర్ అందించిన డ్యాన్స్ మూమెంట్స్ కొత్తగా ఏమీ కనిపించలేదు.
రావణాసుర సినిమాలో రవితేజ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. సుశాంత్ మెయిన్ లీడ్ గా థ్రూ అవుట్ కనిపించబోతున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న సినిమాకు నిర్మాత అభిషేక్ నామా.