నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే: ఎంపీ రవి కిషన్

కాస్టింగ్ కౌచ్.. సినిమా ప‌రిశ్ర‌మ‌ని ఓ కుదుపు కుదిపిన అంశం. ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించారు. అయితే, లేడీ ఆర్టిస్టులు మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడేవారు.…

కాస్టింగ్ కౌచ్.. సినిమా ప‌రిశ్ర‌మ‌ని ఓ కుదుపు కుదిపిన అంశం. ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించారు. అయితే, లేడీ ఆర్టిస్టులు మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడేవారు. అయితే, పురుషులకు కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటాయంటూ బీజేపీ ఎంపీ, న‌టుడు ర‌వి కిష‌న్ త‌నకు ఎదురైన చేదు అనుభవాలు తెలిపారు. 

తాజాగా ఓ మీడియాతో ర‌వి కిష‌న్ మాట్లాడుతూ.. సినీ ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన కొత్త‌లో తాను ఓ మ‌హిళ నుండి కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని.. ఆమె పేరు ఇప్పుడు చెప్పాలేన‌ని.. ప్ర‌స్తుతం ఆమె పెద్ద స్థాయిలో ఉంద‌న్నారు. ఒక రోజు కాఫీ కోసం రాత్రికి రావాల‌ని ఆమె పిలిచింద‌ని.. తాను ఎందుకు పిలిచిందో అర్థ‌మ‌వ్వ‌డంతో నో చెప్పాన‌న్నారు. నా దగ్గర టాలెంట్‌ ఉంది, అందుకే షార్ట్‌కర్ట్ ను ఎంచుకోలేదన్నారు.

ఇదిలా ఉండగా.. రవికిషన్‌ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భోజ్‌పురిలో బాగా ఫేమస్‌ అయిన రవి కిషన్‌.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశారు. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రంలో.. ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రతో మంచి గుర్తింపు పొందారు. కిక్-2, సుప్రీం, రాధ‌, లై, సాక్ష్యం, సైరా లాంటి సినిమాల్లో కూడా న‌టించారు. ప్ర‌స్తుతం గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.