ఎఫ్ 3 సినిమా కోసం పెద్ద ఫైట్ నే చేయాల్సి వచ్చింది దర్శకుడు అనిల్ రావిపూడికి. సినిమా ముందు అన్నీ తానై ప్రమోషన్ చేసుకున్నాడు. ఎక్కని చానెల్ లేదు. చేయని ఇంటర్వూ లేదు. మొత్తం మీద సినిమాకు బజ్ తెచ్చుకున్నాడు. విడుదలైన తరువాత టాక్ ఓకె అనుకున్నా, సన్నాయి నొక్కలు తప్పలేదు. వాటి వల్ల బాధపడినా వెయిట్ చేసాడు. అదృష్టం వర్కవుట్ అయింది. సినిమా నిలబడింది.
అన్నింటికి మించి నిర్మాత దిల్ రాజు తీసుకున్న నిర్ణయం కూడా ప్లస్ అయింది. సినిమా విడుదలకు తన స్వంత ఏరియాలైన వైజాగ్, నైజాం, కృష్ణా, గుంటూరు మినహా మిగిలినవి విక్రయంచారు.
కానీ సినిమా విడుదలయిన వెంటనే కాన్ఫిడెన్స్ పెరిగి, అమ్మిన ఏరియాలు కూడా డిస్ట్రిబ్యూషన్ కింద మార్చేసుకున్నారు. దాంతో కలెక్షన్లు చూసుకుంటూ, థియేటర్లు పెంచడం, తగ్గించడం చేసుకుంటూ నిలబెట్టుకుని వచ్చారు. దానివల్ల మంచి లాభాలు కళ్ల చూసారు.
ఇప్పటికీ థియేటర్లలో మంచి సినిమా లేకపోవడంతో వీకెండ్లలో షేర్ వస్తోంది. నెల్లూరు సిటీలో ముఫై మూడో రోజు కూడా దగ్గర దగ్గర 20 వేలు షేర్ రావడం ఈ టఫ్ టైమ్ లో చెప్పుకోదగ్గ విషయమే. నెల్లూరు సిటీ టోటల్ షేర్ నే 90 లక్షలు వుంది. ఇక్కడ నెల్లూరు ఎందుకు ప్రస్తావించడం అంటే ఆంధ్రలో లీస్ట్ ఏరియా అదే కనుక.
మొత్తానికి అనిల్ రావిపూడి వేసిన మసాలా వేయకుండా ఎన్ని మసాలాలు వేయాలో అన్నీ వేసేసి, సక్సెస్ అయిపోయా అనిపించేసుకుని బాలయ్య సినిమా మీదకు ఆనందంగా వెళ్లిపోతున్నారు.