టాలీవుడ్ సీన్ భలేగా వుంది.
ఒక పక్క ఆంధ్రలో టికెట్ రేట్లు లేవు. ఫ్యామిలీలు సినిమాలకు రావడం లేదు.
కానీ మరోపక్క నాన్ థియేటర్ ఆదాయం బాగా పెరిగింది.
ఇంకోపక్క ఫ్యామిలీలు థియేటర్ కు రావడం లేదు.
ఇన్ని వ్యవహారాలు ఇలా వున్నా హీరోల రెమ్యూనిరేషన్లు మాత్రం పెరిగిపోతున్నాయి.
చకచకా సినిమాలు ఒప్పుకుంటున్న హీరో రవితేజ రెమ్యూనిరేషన్ ఇప్పుడు ఏకంగా 18 కోట్లకు చేరిపోయిందని తెలుస్తోంది. క్రాాక్ సినిమా తరువాత రవితేజ మార్కెట్ మామూలుగాలేదు మరి.
ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలు పూరి కావస్తున్నాయి. నక్కిన త్రినాధరావు సినిమా, సుధీర్ వర్మ సినిమా ప్రకటించేసారు. ఇప్పుడు మరో సినిమా ప్రకటించబోతున్నారు. దొంగాట వంశీ కృష్ణ డైరక్షన్ లో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను ప్రకటించబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకు నిర్మాత.
రవితేజకే 18 కోట్లు అంటే టోటల్ ప్రొడక్షన్ ఎలా లేదన్నా 50 కోట్లకు చేరిపోతుంది. ఎలా వర్కవుట్ అవుతుందో నిర్మాతలకే తెలియాలి.