రావిపూడీ…నిన్నొదల…దిల్ రాజు

దిల్ రాజు ఆస్థానంలో సరైన కమర్షియల్ డైరక్టర్లు లేరు. వున్నది ఒక్కరే..అనిల్ రావిపూడి. అందుకే ఆయనను వదులుకోలేకపోతున్నారు దిల్ రాజు. ఇప్పటికి అయిదు సినిమాలు చేసారు.  Advertisement ఇప్పుడు అనిల్ రావిపూడి ఓ సినిమా…

దిల్ రాజు ఆస్థానంలో సరైన కమర్షియల్ డైరక్టర్లు లేరు. వున్నది ఒక్కరే..అనిల్ రావిపూడి. అందుకే ఆయనను వదులుకోలేకపోతున్నారు దిల్ రాజు. ఇప్పటికి అయిదు సినిమాలు చేసారు. 

ఇప్పుడు అనిల్ రావిపూడి ఓ సినిమా బయట చేయాల్సి వుంది. అది కూడా ఈనాటి కమిట్ మెంట్ కాదు. ఎప్పుడో రాజా దీ గ్రేట్ నాటిది. పాపం ఆ నిర్మాత అలా వెయిటింగ్ లో వున్నారు. ఇన్నాళ్లకు చాన్స్ వచ్చింది. బాలయ్య-రావిపూడి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇలాంటి టైమ్ లో దిల్ రాజు ఎంటర్ అయిపోయి ఆ ప్రాజెక్టులో తన వేలు పెట్టి తన బ్యానర్ ను అక్కడా కంటిన్యూ చేయాలనుకుంటున్నట్లు బోగట్టా. 

ఓ పక్క బాలయ్యతో సినిమా చేయాలని వుంది. అనిల్ ను వదలుకోకూడదు. అందుకే వేరే వాళ్ల ప్రాజెక్టులో వాటా కోసం తెగ వత్తిడి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దిల్ రాజు బ్యానర్ లాంటిది తోడైతే ఇక ఆ చిన్న బ్యానర్ ఎక్కడ కనిపిస్తుంది. వాళ్లకు పేరు ఎలా వస్తుంది. ఇప్పటికే బ్యానర్లు తగ్గిపోతున్నాయి. 

అందువల్ల దిల్ రాజు పెద్ద మనసు చేసుకుని, ఆ చిన్న బ్యానర్ ను ఇండిపెండెంట్ గా వదిలేయడం మంచిది. ఎంత సేపూ మన బ్యానర్ నే కాదు, అన్ని బ్యానర్లూ బతకాలి కదా?