రవితేజ అంటే ప్రేక్షకులకు ఎందుకు ఇష్టం. ఎందుకంటే స్క్రీన్ మీద రవితేజ చేసే అల్లరి, వెటకారం, వెక్కిరింత, వెరసి ఫన్..ఫన్..ఫన్. రాజమౌళి లాంటి డైరక్టర్ కూడా తన సినిమాలో సీరియస్ రవితేజను చూపించడం కోసం, ఓ అల్లరి రవితేజ క్యారెక్టర్ కూడా క్రియేట్ చేసాడు.
ఎందుకంటే రవితేజ అంటే అల్లరే..చిల్లరే..అదే ఆయన ఫ్యాన్స్ కు కావాల్సిన మజా. పండగకు వస్తున్న టాగోర్ మధు-గోపీచంద్ మలినేనిల క్రాక్ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది.
ట్రయిలర్ అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ గా వుంది. భారీ సినిమా చూడబోతున్నామన్న ఫీల్ ను కలిగించింది. సంక్రాంతికి కావాల్సింది ఇలాంటి సినిమా కదా? అన్న థాట్ వచ్చేలా చేసింది. హీరో ఎలివేషన్లు , డైలాగులు, ఫైట్లు, రొమాన్స్ అన్నీ బాగున్నాయి.
కానీ ఏదీ అసలు క్రాక్ ఎక్కడ? రవితేజ అంటేనే క్రాక్. ఆ క్రాక్ నుంచి వచ్చే ఫన్ కోసమే కదా జనాలు వచ్చేది. ఆ క్రాక్ ను ట్రయిలర్ లో లేకుండా దాచినట్లు కనిపిస్తోంది. విడుదల దగ్గర చేసి అసలు సిసలు క్రాక్ ను చూపిస్తారని తెలుస్తోంది