Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇది క్లాస్-మాస్ కలబోసిన ధమాకా

ఇది క్లాస్-మాస్ కలబోసిన ధమాకా

ఈ మధ్యే సెట్స్ పైకొచ్చింది రవితేజ-త్రినాధరావు నక్కిన సినిమా. అసలు వస్తుందా రాదా అనే అనుమానాలతో మొదలైన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు షూటింగ్ మోడ్ లోకి ఎంటర్ అవ్వడంతో పాటు ఫస్ట్ లుక్, టైటిల్ కూడా రిలీజ్ చేసే స్టేజ్ కు చేరుకుంది. దసరా సందర్భంగా రవితేజ-నక్కిన సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ధమాకా అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ లో రవితేజ లుక్ ను గమ్మత్తుగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో మాస్, క్లాస్ ఎలిమెంట్స్ రెండూ ఉంటాయనే అర్థం వచ్చేలా ఒకే స్టిల్ లో మాస్, క్లాస్ టచ్ ఇస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఇది మాస్-క్లాస్ షేడ్స్ చూపించడం వరకే పరిమితమా లేక సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అనే క్లారిటీ లేదు. ఈ అనుమానాలకు కారణం ఈ సినిమాకు డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టడమే.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ-మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాతో కలిపి రవితేజ 3 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చినట్టయింది. అతడు నటిస్తున్న ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?