అంతా మా దర్శకుడే చేశాడు – రవితేజ

టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం తెలుగు మీడియా ముందుకొచ్చాడు రవితేజ. ఈ సినిమా క్రెడిట్ మొత్తాన్ని దర్శకుడికి ఆపాదించాడు. సినిమాలో తామంతా అంత బాగా నటించామంటే దానికి కారణం, సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్…

టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం తెలుగు మీడియా ముందుకొచ్చాడు రవితేజ. ఈ సినిమా క్రెడిట్ మొత్తాన్ని దర్శకుడికి ఆపాదించాడు. సినిమాలో తామంతా అంత బాగా నటించామంటే దానికి కారణం, సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందంటే దానికి కారణం కూడా దర్శకుడు వంశీనే అనేది రవితేజ మాట.

టైగర్ నాగేశ్వరరావు అనే మ్యాచ్ ను దర్శకుడు వంశీ బాగా ఆడాడని, తమ అందరితో బాగా ఆడించాడని అన్నాడు రవితేజ. ప్రతి ఆర్టిస్టుతో ఎలా కావాలంటే అలా వంశీ ఆడుకున్నాడని.. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు అర్థం కావడం లేదంటున్నాడు. ఇది ప్రేక్షకుల విజయం అన్నాడు.

ఈ సందర్భంగా మరో భారీ స్టేట్ మెంట్ కూడా వదిలాడు రవితేజ. తన కెరీర్ లో విక్రమ్ రాధోడ్ తర్వాత టైగర్ నాగేశ్వరరావు పాత్ర నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఆర్టిస్టులు కనిపించలేదంట. కేవలం పాత్రలే కనిపించాయంట. ఆ క్యారెక్టరైజేషన్స్ అలా రావడానికి, ఆర్టిస్టులు అలా నటించడానికి కారణం వంశీనే అంట.

సినిమా మేకింగ్ లో వంశీకి చాలా క్లారిటీ ఉందని, అలాంటి క్లారిటీ ఉన్న వ్యక్తులతో సినిమాలు చేయడం తనకు చాలా ఇష్టమన్నాడు. వంశీతో తను ఇంకా ట్రావెల్ అవుతానని ప్రకటించాడు.

సక్సెస్ మీట్ అంటూ ఏర్పాటుచేసిన ఈ ప్రెస్ మీట్ లో సినిమాపై వస్తున్న విమర్శలపై స్పందించడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. మీడియాతో 'ప్రశ్న-సమాధానం' కార్యక్రమం కూడా నిర్వహించకుండానే ముగించారు.