వాల్తేర్ వీరయ్య సినిమా నుంచి రవితేజ ఎంట్రీ వచ్చేసింది. ఆ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అన్నట్లుగా ఓ చిన్న టీజర్ ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసారు.
దర్శకుడు బాబి చాల హై లెవెల్ యాక్షన్ సీన్ ను కూల్ గా కట్ చేసారు. ‘ఫస్ట్ టైమ్ ఓ పులి, మేకను ఎత్తుకుని వస్తోంది’ అనే డైలాగ్ తో రవితేజను స్రీన్ మీద ప్రెజెన్స్ చేసారు. ఆపై ఓ మాంచి యాక్షన్ కట్ చిత్రీకరించారు. తరువాత మళ్లీ రవితేజ చేత తెలంగాణ మాండలీకంలో సరదా డైలాగులు చెప్పించారు.
మొత్తం మీద వాల్తేర్ వీరయ్య కు రవితేజ క్యారెక్టర్ పెద్ద అసెట్ గా వుండబోతందని చిన్న క్లారిటీ ఇచ్చారు దర్శకుడు బాబి. రవితేజ అంటే స్పెషల్ ఇంట్రస్ట్ బాబి కి. ఎందుకంటే బాబిని రచయితను, దర్శకుడిని చేసింది రవితేజనే. ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ఓకె చేసింది కూడా బాబి కోసమే. అందుకే కచ్చితంగా రవితేజ క్యారెక్టర్ ను హైలైట్ చేస్తాడని ఫ్యాన్స్ అనుకుంటూ వస్తున్నారు.
టీజర్ చూసాక ఫ్యాన్స్ నమ్మకాలు నిలబడేలాగే వున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది.