రవితేజ పీరియాడిక్ సినిమా

మాస్ మహారాజా రవితేజకు పీరియాడిక్ సినిమాలు కొత్త కాదు. చాలానే చేసాడు. మళ్లీ మరో సినిమా చేయబోతున్నాడు. కొత్త దర్శకుడితో సితార సంస్థ నిర్మించే రవితేజ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని…

మాస్ మహారాజా రవితేజకు పీరియాడిక్ సినిమాలు కొత్త కాదు. చాలానే చేసాడు. మళ్లీ మరో సినిమా చేయబోతున్నాడు. కొత్త దర్శకుడితో సితార సంస్థ నిర్మించే రవితేజ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా అరకు అటవీ ప్రాంత నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది.ఈ కొత్త దర్శకుడు భాను భోగవరపు ఎలాగైనా రవితేజతోనే ఈ కథ చేయాలని పట్టుపట్టి కూర్చున్నాడట.

రవితేజ ఓకె అన్న తరువాత ముగ్గురు నలుగురు నిర్మాతలకు చెప్పడం, ఆఖరికి సితార సంస్థ దగ్గర ఫిక్స్ కావడం జరిగిపోయింది. శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకుని, ఇటీవలే సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ లో చేస్తున్నాడు రవితేజ. ఆ హిందీ రీమేక్ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది.

దాని తరువాత సితార సంస్థ సినిమా వస్తుంది. ప్రస్తుతానికి రవితేజ అంగీకరించిన సినిమాలు ఈ రెండే. ఈ రెండింటి తరువాత ఏ సినిమా అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. చకచకా సినిమాలు చేసే సీనియర్ హీరోల జాబితాలో ముందు వుంటారు రవితేజ.