ఏయూలో వైఎస్ విగ్రహం కదిలిపోతోంది

వైఎస్సార్ అయిదుంపావు ఏళ్ళు ఉమ్మడి ఏపీని పాలించారు. సంక్షేమ సారధిగా నిలిచారు. అభివృద్ధి వారధిగానూ వెలిసారు. వైయస్సార్ అకాల మరణం తట్టుకోలేక ఎంతో మంది మరణించారు. అలా మరణించి వైఎస్సార్ దేవుడు అయ్యారు. Advertisement…

వైఎస్సార్ అయిదుంపావు ఏళ్ళు ఉమ్మడి ఏపీని పాలించారు. సంక్షేమ సారధిగా నిలిచారు. అభివృద్ధి వారధిగానూ వెలిసారు. వైయస్సార్ అకాల మరణం తట్టుకోలేక ఎంతో మంది మరణించారు. అలా మరణించి వైఎస్సార్ దేవుడు అయ్యారు.

ఆయన విగ్రహాలను ఊరూరా ఏర్పాటు చేశారు. అభిమానం ముందు కొన్ని సార్లు నిబంధనలు చూసుకున్నారా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి. అంతా బాగుంటే సరేగానే ఉంటుంది కానీ ఇపుడు ఏపీలో రాజకీయాలు వేరేగా ఉన్నాయి.

దాంతో గత ప్రభుత్వాల తీరుతెన్నులను తిరగతోడుతున్న వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఏయూలో వైఎస్సార్ విగ్రహం మీద కన్ను పడింది అని అంటున్నారు. నిబంధలను అతిక్రమించి ఏయూలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం తొలగించాలని తెలుగు విద్యార్ధి నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు వారు ఏయూ అధికారులకు వినతిపత్రం అందించారు.

నిబంధనలు పాటించనందున విగ్రహం ఉండరాదని అంటున్నారు. ఏపీలో అలా నిబంధనలు లేనివి చాలానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహనీయుల విషయంలో రాజకీయాలు చేయడం తగునా అన్న చర్చకు కూడా సరిగ్గా ఇక్కడే తెర లేస్తోంది.