Advertisement

Advertisement


Home > Movies - Movie News

రామ్ చరణ్ 16వ సినిమా అప్ డేట్

రామ్ చరణ్ 16వ సినిమా అప్ డేట్

ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ ఛేంజర్ సినిమా మీద అలా వుండిపోయారు మెగా హీరో రామ్ చరణ్. గేమ్ ఛేంజర్ రకరకాల కారణాల వల్ల నత్తనడక నడుస్తోంది. ఈ కారణంగా దాని తరువాత సినిమా అలా వెయిటింగ్ లో వుండిపోయింది.

బుచ్చిబాబు డైరక్షన్ లో తయారు కావాల్సిన సినిమా స్క్రిప్ట్, కాస్టింగ్, టెక్నికల్ క్రూ అన్నీ డిసైడ్ అయిపోయి రెడీగా వున్నాయి.  జాన్వి హీరోయిన్. రెహమాన్ సంగీతం. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆర్ సి ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

వాళ్లకు ఆసక్తి కరమైన వార్త ఇది. ఈ నెల 20న సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ రోజున ఆర్ సి 16 సినిమా ప్రారంభానికి సుముహుర్తం అన్నమాట. వృద్ది సినిమాస్, మైత్రీ సినిమాస్ కలిసి నిర్మించే ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం బుచ్చిబాబు.

ఇటీవలే ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర అంతా అడిషన్లు నిర్వహించారు. అనేక పాత్రల కోసం లోకల్ టాలెంట్ ను ఎంపిక చేసి వుంచారు. ఉత్తరాంధ్ర లోని రామభద్రపురం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?