కొత్త ఏడాదిలో కూడా ఆగని ట్రెండ్

గతేడాది రీ-రిలీజ్ ట్రెండ్ పీక్ స్టేజ్ లో నడిచింది. స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాల్ని కూడా రీ-రిలీజ్ చేశారు కొంతమంది. ఒక దశలో హీరోల ఫ్యాన్స్ కే మొహం మొత్తింది. దీంతో కొత్త ఏడాదిలో…

గతేడాది రీ-రిలీజ్ ట్రెండ్ పీక్ స్టేజ్ లో నడిచింది. స్టార్ హీరోల ఫ్లాప్ సినిమాల్ని కూడా రీ-రిలీజ్ చేశారు కొంతమంది. ఒక దశలో హీరోల ఫ్యాన్స్ కే మొహం మొత్తింది. దీంతో కొత్త ఏడాదిలో ఈ ట్రెండ్ తగ్గుతుందని అంతా భావించారు.

కానీ దీనికి రివర్స్ లో జరుగుతోంది. ఈ ఏడాది కూడా రీ-రిలీజ్ ట్రెండ్ లో ఎలాంటి మార్పు లేదు. సందర్భానుసారం కొన్ని, సమయం-సందర్భం లేకుండా మరికొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.

కెమెరామెన్ గంగతో రాంబాబు.. రీ-రిలీజ్ ట్రెండ్ ను మళ్లీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన సినిమా. పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాను ఈసారి నట్టికుమార్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బిజీగా ఉన్నారని, ఆయన ఫ్యాన్స్ కు సరైన టైమ్ లో ఈ పొలిటికల్ మూవీని అందిస్తున్నానని ఆయన ప్రకటించుకున్నారు.

ఇక్కడ్నుంచి మొదలుపెట్టి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా చాలా రీ-రిలీజ్ లు ఉన్నాయి. సీతారామం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ లాంటి సినిమాల్ని ఆ రోజున విడుదల చేస్తున్నారు.

ఇక మార్చిలో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. అదే నెలలో చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 23-24 తేదీల్లో 2 రోజుల పాటు నాయక్ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఇదే నెలలో జర్నీ సినిమా కూడా రీ-రిలీజ్ కాబోతోంది.

ఇలా ఈ ఏడాది కూడా రీ-రిలీజ్ ట్రెండ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. చూస్తుంటే, గతేడాది కంటే ఎక్కువగానే ఈ ఏడాదిలోనే రీ-రిలీజులు ఉంటాయేమో అనిపిస్తోంది.