సాధారణంగా లిరికల్ వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు సాహిత్యాన్ని అక్షర రూపంలో చూపిస్తుంటారు. మధ్యమధ్యలో మేకింగ్ విజువల్స్ చొప్పిస్తారు. ఇంకాస్త ముందుకెళ్లి వీడియో క్లిప్స్ చూపించడం కూడా జరుగుతుంది. కానీ రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ విషయంలో చివరి రెండు జరగలేదు. తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లిష్ లో ముద్రించి, గ్రాఫిక్స్ జతచేసి వదిలారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశచెందారు. సాంగ్ బాగున్నప్పటికీ మధ్యలో మేకింగ్ లేదా సినిమా క్లిప్ లేకపోవడంతో హర్ట్ అయ్యారు. వీళ్లు ఇంతగా హర్ట్ అవ్వడానికి రీజన్ ఆర్ఆర్ఆర్ లిరికల్ వీడియో. తాజాగా నాటు-నాటు అంటూ ఆర్ఆర్అర్ నుంచి ఓ సాంగ్ వచ్చింది. అందులో మేకింగ్ తోపాటు, చరణ్-తారక్ డాన్స్ చేసిన 2 క్లిప్స్ కూడా చూపించారు. అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ సాంగ్ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సాంగ్ లో ఎలాంటి మూవీ క్లిప్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ ఎక్కువైంది.
నిజానికి ఈ లిరికల్ సాంగ్ తో పాటు సినిమా క్లిప్ రిలీజ్ చేద్దామని మేకర్స్ కూడా అనుకున్నారు. కానీ అలా చేయడం వల్ల పాట సందర్భం, థీమ్, సినిమా స్టోరీ కూడా రివీల్ అయిపోతోంది. అందుకే వద్దనుకున్నారు. ఇక మేకింగ్ వీడియోస్ తో ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. అందుకే లిరికల్ సాంగ్ తో మేకింగ్ వదల్లేదు.
నిజానికి సినిమాలో ఇది యుగళ గీతమో, మరో సందర్భంలో వచ్చే పాటో కాదు. ఇదొక మాంటేజ్ సాంగ్. పైగా ఇదే సాంగ్ పై హీరోయిన్ ను హీరో కాపాడే కీలకమైన సన్నివేశం తీశారట. అందుకే ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకొని గ్రాఫిక్స్ పై ఈ సాంగ్ ను ప్రజెంట్ చేసి రిలీజ్ చేశారు.
ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది.