పిలిచి పిల్లను ఇస్తానంటే కులం తక్కువ అన్నాడని వెనకటికి సామెత. అలాగే ఓ వుంది ఓ టాలీవుడ్ హీరోయిన్ వ్యవహారం. చేతిలో ఒక్క సినిమా తప్ప మరో సినిమా లేదు.
తనంతట తాను అడిగి మరీ యాభై లక్షలు తీసుకుని చేసిన, ఓ చిన్న హీరో పక్కన చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్ కాలేదు. అలాంటి టైమ్ ఓ సీనియర్ హీరో పక్కన హీరోయిన్ చాన్స్ వచ్చింది.
ఇలాంటి చాన్స్ వస్తే, ఆ పొజిషన్ లో వున్న హీరోయిన్ ఎవరైనా వెంటనే ఓకె అంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం కోటిన్నర డిమాండ్ చేసిందట. ఎందుకూ అంటే సీనియర్ హీరో పక్కన కదా? అని రాగాలు తీసిందట. బేరాలు ఆడితే కోటి పాతికకు తగ్గను గాక తగ్గను అందట.
దాంతో నిర్మాతలు ఆమెకు బై చెప్పేసి వేరే ఎవరైనా అంటూ వెదుకుతున్నారు. ఆ అమ్మడు ఆలోచన ఏమిటో మరి?