Advertisement

Advertisement


Home > Movies - Movie News

రెడ్డి గారి ‘పెదకాపు’ ?

రెడ్డి గారి ‘పెదకాపు’ ?

సినిమా టైటిళ్లు చిత్రాతిచిత్రంగా వుంటున్నాయి. ముఖ్యంగా ఆఫ్ బీట్ టైటిళ్లకు డిమాండ్ పెరిగింది. లేటెస్ట్ ఓ చిత్రమైన టైటిల్ వినిపిస్తోంది. పెదకాపు అన్నది టైటిల్. ఇది నిజమా కాదా అన్నది తెలియదు కానీ మాంచి క్యాచీగా అయితే వుంది. 

గమ్మత్తేమిటంటే ఈ పెదకాపు అనే టైటిల్ వినిపిస్తున్న సినిమాకు నిర్మాత ఓ రెడ్డిగారు. గతంలో జయ జానకీ నాయక, అఖండ లాంటి మంచి సినిమాలు నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి ఇప్పుడు ఓ సినిమా నిర్మిస్తున్నారు. దానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.

పక్కా గోదావరి జిల్లాల కథలు, మాటలు కనిపిస్తాయి, వినిపిస్తాయి శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లో. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జనాలు అంత త్వరగా మరుపు రాదు. అలాంటి శ్రీకాంత్ అడ్డాల తన సినిమాకు పెదకాపు అని పెట్డడం కనుక ఫిక్స్ అయితే గోదావరి జిల్లాల నేపథ్యంలో మరో సినిమా తీస్తున్నారనే అనుకోవాలి.

అయితే ఈ సినిమా హీరో ఎవరు అన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. మిరియాల రవీందర్ రెడ్డి అతి దగ్గర బంధువే హీరో అనే వార్తలు వున్నాయి. మరి ఇంతకీ ఎవరు ఆ హీరో, ఈ పెదకాపు టైటిల్ కరెక్టేనా అన్నవి అన్నీ తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?