కల్కి.. భారతీయుడు-2.. గేమ్ ఛేంజర్

ఈ 3 సినిమాలుకు సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా విడుదల తేదీల విషయంలో గట్టి లింక్ ఉంది. ఇప్పుడీ 3 సినిమాల్లో 2 సినిమాల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇంకొక్క సినిమా నుంచి మాత్రం…

ఈ 3 సినిమాలుకు సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా విడుదల తేదీల విషయంలో గట్టి లింక్ ఉంది. ఇప్పుడీ 3 సినిమాల్లో 2 సినిమాల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇంకొక్క సినిమా నుంచి మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

ముందుగా కల్కి, భారతీయుడు-2 సినిమాల విషయానికొద్దాం. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. ఇక కమల్ హాసన్ హీరోగా భారతీయుడు-2 సినిమా తెరకెక్కింది. ఈ రెండు సినిమాల్లో కమల్ ఉన్నారు కాబట్టి విడుదల తేదీల విషయంలో చిన్నపాటి ఇబ్బంది ఎదురైంది.

ఎట్టకేలకు ఈ రెండు సినిమాలకు సక్సెస్ ఫుల్ గా 2 వారాల గ్యాప్ ఇవ్వగలిగారు. కల్కి సినిమా జూన్ 27న విడుదలవుతుంది. ఇక భారతీయుడు-2 సినిమాను జులై 12న రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. అలా 2 సినిమాల మధ్య 2 వారాల గ్యాప్ ఇచ్చారు.

నిజానికి కల్కి సినిమాను మే 9న విడుదల చేయాలనుకున్నారు. ఎన్నికల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం భారతీయుడు-2 సినిమాపై కూడా పడింది. ఒక దశలో భారతీయుడు-2ను జూన్ లో రిలీజ్ అనుకున్నారు. మొత్తానికి రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వచ్చింది.

ఇక మిగిలింది గేమ్ ఛేంజర్ మాత్రమే. భారతీయుడు-2, గేమ్ ఛేంజర్ సినిమాలకు విడుదల తేదీ విషయంలో లింక్  ఉంది. ఈ రెండు సినిమాలకు శంకరే దర్శకుడు. భారతీయుడు-2 థియేటర్లలోకి రాకుండా గేమ్ ఛేంజర్ ను విడుదల చేయకూడదనేది నిబంధన. అందుకే ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమాకు రిలీజ్ డేట్ చెప్పలేదు.

ఇప్పుడు భారతీయుడు-2 సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో, రేపోమాపో గేమ్ ఛేంజర్ విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.