ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి చిత్రాలతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం 'జాతిరత్నాలు`. నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్బంగా చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ మీడియాతో మాట్లాడారు.
షార్ట్ ఫిలిం చూసి..
ఈ సినిమా కథ డైరెక్డర్ వచ్చి నాకు చెప్పలేదు. అనుదీప్ చేసిన ఒక కామెడీ షార్ట్ ఫిలిం నచ్చి నేనే అతన్ని వెతుక్కుంటూ వెళ్లాను. నాకు జంధ్యాలగారి, ఎస్వి కృష్టారెడ్డి సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే అలాంటి ఒక హిలేరియస్ సినిమా చేద్దాం అని డైరెక్టర్ ని వెళ్లి కలిశాను. తను చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేసి ఈ సినిమా చేశాం.
నవీన్, రాహుల్, ప్రియదర్శి కాంబినేషన్
నవీన్, విజయ్ నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుండి పరిచయం. ఫస్ట్ ఎవడే సుబ్రమణ్యం సినిమాని విజయ్, నవీన్‌తో కలిసి తీద్దాం అనుకున్నాను కాని కుదరలేదు. అనుదీప్ ఈ సినిమా స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు నవీన్ అయితే బాగుంటుంది అనిపించింది.
తను అప్పుడే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కి వెళ్తున్నాడు. తనకి ఈ స్టోరీ పంపాను. తనకి నచ్చింది. అలాగే మిగతా పాత్రలకి రాహుల్, ప్రియదర్శికి కూడా కథ నచ్చడంతో వారిని ఎంచుకోవడం జరిగింది.
జాతి రత్నాలు స్టోరీ లైన్
ఈ సినిమా రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుకోవడమే..ఇంక స్టోరీ లైన్ అంటారా మా డైరెక్టర్ అనుదీప్ చెప్పినట్టు చెప్తాను. ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది?అనేదే ఈ సినిమా కథ. మనీ మనీ, అనగనగా తరహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్.
నిర్మాతగా, డైరెక్టర్‌గా
ఒక సీన్ అనుకున్నప్పుడు ఇలా తీద్దాం అని ప్రతి డైరెక్టర్ కి ఒక విజన్ ఉంటుంది. కాబట్టి ఒక నిర్మాతగా అనుదీప్ ఐడియా క్లాష్ అవకుండా, క్రియేటివ్‌గా, టెక్నికల్ గా అతని ఫ్లేవర్ తగ్గకుండా అన్ని సమకూర్చాను.
ఎప్పుడైనా నాకు ఎమైనా అనిపిప్తే ఈ షాట్ ఇలా కూడా తీసుకోవచ్చేమో కదా అని అనుదీప్ వెనక నుండి చెప్పేవాడిని. దానికి బదుులుగా ఎప్పుడు వెళ్తారు సర్ ఇంటికి అనే వాడు..ఇలా షూటింగ్ అంతా చాలా సరదాగా జరిగింది.
హీరోయిన్ సెలక్షన్
క్యాస్టింగ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఫరియా కనిపించింది. ఈ సినిమాకి అనే కాకుండా ఈ అమ్మాయి డేఫినెట్గా స్క్రీన్ మీద బాగుంటుంది అనిపించింది.
తనతో మాట్లాడినప్పడు తనకి మంచి కామెడీ టైమింగ్ ఉంది అనిపించింది. ఈ విషయం అనుదీప్‌కి చెప్పగానే ఓకే అన్నాడు.
ప్రభాస్ సినిమా
నా ప్రతి సినిమాలో హ్యూమర్ ఉంటుంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలు తీసుకుంటే అందులో హ్యూమర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ తో చేసే సినిమాలో కూడా మంచి హ్యూమర్ ఉంటుంది. ప్రభాస్ తో సినిమా డెఫినెట్‌గా ఒక కొత్త తరహా చిత్రం. స్క్రిప్ట్ కొత్తగా ఉంటుంది. ఆ సినిమాకి కావాల్సిన ప్రపంచాన్ని సృష్టించడానికి కొంత సమయం పడుతుంది. జులై నుండి ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం.
ప్రభాస్ దగ్గరకు వెళ్లేటప్పుడు పెద్ద స్టార్ అని ఒక హైప్‌తో వెళ్తాం.. కాని ఆయన ఎంత కంఫర్టబుల్ ఉంటారంటే మనం హ్యాపీగా మాట్లాడొచ్చు. ఆయన ఈ సినిమా లెక్కలు, బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ఎప్పుడూ పట్టించుకోడు..సోషల్ మీడియా మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడైనా మాట్లాడితే మా సినిమా గురించి కాని, ఆయన చేస్తున్న ఇతర సినిమాల స్టోరీస్ గురించే మాట్లాడుతారు. అందుకే ఆయన అంత కూల్ గా ఉంటాడేమో..