పవన్ కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు హడావుడి నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియాలోకి వదలిన ఓ వీడియో వైరల్ అయింది. అకీరా బాక్సింగ్ నేర్చుకుంటున్న వీడియో అది. అయితే ఈ సందర్భంగా నెటిజన్లకు రేణు ఓ విషయం చెప్పారు.
అకీరాకు హీరో కావాలన్న ఉద్దేశం లేదు. ఏ సినిమాకు సైన్ చేయలేదు. అకీరా తెరంగ్రేటం పై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఏ సినిమాకు సైన్ చేయలేదు అన్నంత వరకు నిజం. కానీ నటుడు అయ్యే ఉద్దేశం లేదు అన్నది మాత్రం నిజం కాదు. అకీరా నటుడు కావడం కోసమే రకరకాల శిక్షణలు తీసుకుంటున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ నే స్వయంగా ఏర్పాటు చేసారు. అకీరా తన సోదరితో కలిసి ప్రస్తుతం తండ్రి పవన్ దగ్గరే వుంటున్నాడు.
సరైన సమయంలో అకీరాను లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బాధ్యత అంతా పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ మీదే వుంది. త్రివిక్రమ్, సితార బ్యానర్ లే అకీరా లాంచింగ్ వ్యవహారం చూస్తాయి. అయితే దానికి కొంచెం టైమ్ వుంది. ఇవి తెలుస్తున్న వాస్తవాలు. మరి రేణు ఎందుకు అలా చెప్పారో?