గెలికి తన్నించుకోవడంలో బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులు ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకోని తన జీవితం ఏదో తను బతుకుతుంటే అప్పుడప్పుడు కొంత మంది పవన్ ఫ్యాన్స్ అతితో రేణు దేశాయ్ ను ఇబ్బందులకు గురిచేస్తునే ఉంటారు. తనను రెచ్చగొట్టి రేణుతో పవన్ మర్యాద తీస్తుంటారు. గత రెండు రోజులు క్రితం మొదలైన పవన్ అభిమానులు వర్సెస్ రేణు దేశాయ్ రచ్చ నడుస్తునే ఉంది. తాజాగా ఓ నెటిజన్ తనకు పంపిన మేసేజ్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ అభిమానులకు కౌంటర్ ఇచ్చింది.
'పవన్‌తో మీరు విడిపోయి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయినా జనాలు ఇంకా చెత్త వాగుడు మాట్లాడుతున్నారు. ఇన్నేళ్లుగా వాళ్లందరి మాటలు భరిస్తూ, స్ట్రాంగ్‌గా ముందుకు వెళుతున్నా మళ్లీ మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు..పవన్ అభిమానులుగా చెప్పుకునే ఈ పిచ్చి ఫ్యాన్స్ మిమ్మల్ని ఇంత బాధపెడుతుంటే వాళ్ల నోళ్లు మూయించడానికి పీకే ఒక్క స్టేట్‌మెంట్ అయినా ఎందుకు ఇవ్వరు?.. రాష్ట్ర ప్రజలందరి బాధలు పట్టించుకుంటా, ఆడవాళ్లంటే గౌరవం అని చెప్పుకొని తిరిగే పవన్ తన మాజీ భార్య విషయంలో ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు? ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇంత మానసిక సంఘర్షణకు గురవుతుంటేనే పట్టించుకోని పీకే రాష్ట్ర ప్రజలందరి గురించి ఎలా చూసుకుంటాడు? మీకోసం ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఆపడానికి ఆయనకు ఏం అడ్డు వస్తుందో అర్థం కావడం లేదు'. అంటూ ఒక నెటిజన్ తనకు పంపిన మేసేజ్ ను షేర్ చేసింది.
ఆ నెటిజన్ కామెంట్ కు రిప్లై ఇస్తూ… “మీలాగే ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలామంది అడుగుతారు. కానీ వాటికి నా దగ్గర సమాధానం లేదు. నా పరిధిలో లేని విషయాల గురించి నేనేం చెప్పను?” అంటూ బదులిచ్చారు. కాగా రెండు రోజుల క్రితం రేణు దేశాయ్ తన కొడుకు అకీరాను మా అన్న కొడుకు అని పవన్ ఫ్యాన్స్ సంబోధించడంతో ఫైర్ అయ్యింది. 'మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మాట్లాడే పద్ధతి నేర్చుకోండి' అని కౌంటర్ ఇవ్వడం తెలిసిందే.
రాజకీయ పార్టీల కంటే పవన్ అభిమానుల అతి వల్లే పదే పదే జనాల్లో పవన్ మూడు పెళ్లిల గురించి చర్చ జరుగుతోంది. నిన్నటి రోజు కూడా 'కోర్టులో ఆ రోజు రేణు దేశాయ్ గనక నా కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. పవన్ నన్ను పెళ్లి చేసుకున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేదని కానీ రేణు పవన్ మర్యాదను కాపాడిందంటూ' ఒక సామాజిక కార్యకర్త రేణుకు సపోర్టుగా మాట్లాడిన వీడియోను షేర్ చేసింది.