Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

విరూపాక్ష..విలేజ్ హర్రర్ స్టోరీ

విరూపాక్ష..విలేజ్ హర్రర్ స్టోరీ

అనగనగా ఓ గ్రామం. చాలా కాలం తరువాత ఆ ఊరికి వచ్చిన కుటుంబం. పట్నం అబ్బాయి, పల్లెటూరి ప్రేమలో పడిన క్షణాలు.. అంతలోనే ఆ ఊరికి పట్టిన అరిష్టమో, గ్రహచారమో.. చేతబడో.. చిల్లంగో..మొత్తానికి హర్రర్ టర్న్ తీసుకున్న కథ. 

అక్కడి నుంచి ఏం జరిగింది..ఈ నెలలో విడుదలవుతున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ట్రయిలర్ చూస్తుంటే తట్టే కథ ఇదే. బివిఎస్ఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కార్తీక్ దండు సినిమా విరూపాక్ష. ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సాయి ధరమ్ తేజ్ చేసిన తొలి సినిమా ఇది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అల్లుకున్న హర్రర్ థ్రిల్లర్ స్టోరీ మాదిరిగా కనిపిస్తోంది ట్రయిలర్. ట్రయిలర్ తొలిసగం వరకు లైన్ లో వెళ్లింది. మలిసగం, ఇంట్రస్టింగ్ థ్రిల్లింగ్ సీన్లు అన్నీ కట్ చేసి వేసారు. ఆ విధంగా సినిమా మీద ఆసక్తి జనరేట్ చేయడానికి ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది. 

ట్రయిలర్ లో పెర్ ఫెక్ట్ స్టార్ కాస్టింగ్ కనిపించింది. సంయుక్త మీనన్ అందంగా కనిపించింది. హీరో ఒకటి రెండు సీన్లు తప్పించి మిగిలిన సీన్లలో మళ్లీ తన స్టామినా తాను తెచ్చుకున్నట్లే కనిపించాడు.

బ్యాక్ గ్రవుండ్ స్కోర్, సీన్ల ఫ్రేమ్ లు, గెటప్ లు, సెటప్ అంతా కలిపి మంచి థ్రిల్లర్ ను చూడబోతున్న లుక్ ను అయితే తీసుకువచ్చాయి. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్ లోకి వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?