కష్టమైనా కఠిన నిర్ణయం తీసుకున్నానని ప్రముఖ నటి రేణూదేశాయ్ చెప్పుకొచ్చారు. ఆమె చెప్పిన విషయాలపై లోతుగా ఆలోచిస్తే పర్యావరణంపై ఎంత శ్రద్ధాసక్తులో తెలిసొస్తాయి. ప్రకృతిని కాపాడుకునేందుకు ఆమె పడుతున్న తపన నిస్సందేహంగా ప్రశంసనీయం.
సామాజిక, సినీ అంశాలపై తనదైన స్టైల్‌లో రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ స్పందిస్తూ తన అభిరుచులు, భావాలను పంచుకుంటుంటారు. ఇప్పుడు కూడా అలాంటి కంటెంట్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. కాలుష్యాన్ని నియంత్రించే విషయమై సోషల్ మీడియా వేదికగా ఆమె కొన్ని విషయాలు తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలనే నినాదంతో ఆమె ముందుకొచ్చారు. ఇందుకు బలమైన కారణాన్ని కూడా రేణూ చెప్పుకొచ్చారు. మారిషస్‌లో చమురు లీకేజీతో భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో వాటి వాడకాన్ని తగ్గించడమే శ్రేయస్కరమంటున్నారు. తద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్ట వచ్చని ఆమె తెలిపారు.
పెట్రోల్, డీజిల్ వాడకానికి ప్రత్యామ్నాయంగా ఇతర వనరులపై దృష్టి పెట్టాలన్నారు. ఎలక్ట్రిక్ కార్లు, బైకులు వాడకంపై శ్రద్ధ పెట్టడం మంచిదన్నారు. ఇక తన వరకూ వస్తే…ఇంధనంతో నడిచే ఆడీ ఎ6, పోర్చ్సే బాక్సర్ కార్లను విక్రయించి… ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొనుగోలు చేసినట్టు చెప్పి రేణూ దేశాయ్ ఆశ్చర్యపరిచారు.
తన రెండు కార్లను అమ్మడమనేది మనసుకు చాలా కష్టమైన పనే అయినప్పటికీ… కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. మారిషస్‌లో చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాలతో జీవరాశులకు క్యాన్సర్‌ను అంటిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రేణూ దేశాయ్‌లోని నిజాయతీని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. ఎందుకంటే చాలా మందిలా ఆదర్శాల గురించి చెప్పడం కాకుండా…ఆమె ఆచరిస్తున్నారు. ఈ నిజాయతీనే రేణూ దేశాయ్‌కి అభిమానుల్ని తెచ్చి పెట్టింది.