రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ లు విడిపోయారా? విడగొట్టారా? గతంలో అనేక సార్లు మరో హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ను పరోక్షంగా తప్పు పడుతూ వేసిన ట్వీట్ లు ఏ మేరకు నిజం.
ఇప్పుడు ఇవన్నీ మళ్లీ తెరపైకి రావడానికి కారణం..నిర్మాత బండ్ల గణేష్. ఆయన ఈ రోజు రెండు ట్వీట్ లు వేసారు. ఒకటి సినిమా నిర్మాత కావాలంటే గురూజీని కలిసి భారీ గిఫ్ట్ ఇస్తే చాలు అన్నది ఒకటి. రెండవది మరీ సంచలనం. భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, గురు శిష్యులు ఇలా ఎవరినైనా విడగొట్టాలన్న గురూజీకే సాధ్యం అన్నది రెండో ట్వీట్.
ఇక్కడ నేరుగా ప్రస్తావించకపోయినా గురూజీ అంటే త్రివిక్రమ్ అనే ట్విట్టర్ జనాలు,సినిమా జనాలు ఫిక్స్ అయిపోయారు. దాంతో బండ్ల ట్వీట్ ను డీ కోడ్ చేసే పనిలో పడ్డారు. భార్య-భర్త అంటే పవన్ – రేణు అని, తండ్రీ కొడుకులు అంటే ఎన్టీఆర్-బాలయ్య బాబాయ్ అని, గురు శిష్యులు అంటే బండ్ల-పవన్ అని డీ కోడ్ చేసుకుంటున్నారు.
ఇవన్నీ ఎంత వరకు నిజం అన్న సంగతి అలా వుంచితే పవన్ దగ్గర ఇప్పటి వరకు పర్మనెంట్ గా సన్నిహితంగా వున్నది త్రివిక్రమ్ ఒక్కరే. ఎందరో సన్నిహితంగా వెళ్లి, మళ్లీ దూరమైపోయారు. శరత్ మరార్ లాంటి సన్నిహితుడు కూడా ఉన్నట్లుండి దూరం అయ్యారు. అలా ఎందుకు అయ్యారు అన్నది ఎవరికీ తెలియదు కానీ దీని వెనుక కూడా త్రివిక్రమ్ వున్నారని అప్పట్లో గ్యాసిప్ లు వినిపించాయి.
మొత్తం మీద మళ్లీ పాత సంగతులు అన్నీ తవ్వితోడినట్లు అయింది బండ్ల ట్వీట్ తో. అసలు ఇంతకీ ఈ రోజు బండ్ల కాస్త పరోక్షంగా అయినా త్రివిక్రమ్ మీద ఎందుకు దాడిచేసారు అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.