Advertisement

Advertisement


Home > Movies - Movie News

రెస్టారెంట్ బిజినెస్ లోకి మహేష్

రెస్టారెంట్ బిజినెస్ లోకి మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కామ్ గా వుంటూనే తన పనులు చకచకా చక్కబెట్టుకుంటూ వుంటారు. చాలా సైలంట్ గా నిర్మాణ బ్యానర్ స్టార్ట్ చేసి మేజర్ తో ఫస్ట్ హిట్ కొట్టేసారు. 

అంతకు ముందే చాలా సైలంట్ గా ఎ.ఎమ్ బి మల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేసారు. అది ఇప్పుడు హైదరాబాద్ కే ఐకానిక్ థియేటర్ గా మారిపోయింది. ఒక్కప్పుడు ప్రసాద్ ఐమాక్స్ అలా వుండేది. ఇప్పుడు ఎ ఎమ్ బి క్రేజ్ గా మారింది.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే మహేష్ బాబు ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నారు. మాంచి రెస్టారెంట్ ను స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ చెయిన్ ‘మినర్వా’ తో కలిసి ఓ లగర్జీ రెస్టారెంట్ ను స్టార్ట్ చేయబొతున్నట్లు తెలుస్తోంది.

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తారని బోగట్టా. సినిమా నటులు అంతా ఏదో రకమైన ఇన్వెస్ట్ మెంట్ చేస్తూనే వుంటారు. నాగార్జున ఇలాంటి వాటిలో ముందు వుంటారు. మిగిలిన వారంతా భూముల మీదే పెడతారు. కమర్షియల్ కాంప్లెక్స్ లు కొంటారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?