ఔనా?..ఔనాః ఇదేమి చాకిరేవు!

టీడీపీ, జ‌న‌సేన పార్టీల పాలిట ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అతిపెద్ద ప్ర‌త్య‌ర్థిగా త‌యార‌య్యారు. ముఖ్యంగా స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు అరెస్ట్ అయి టీడీపీ, దాని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పుట్టెడు దుఃఖంలో ఉన్నాయి. ఈ స‌మ‌యంలో…

టీడీపీ, జ‌న‌సేన పార్టీల పాలిట ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అతిపెద్ద ప్ర‌త్య‌ర్థిగా త‌యార‌య్యారు. ముఖ్యంగా స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు అరెస్ట్ అయి టీడీపీ, దాని మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పుట్టెడు దుఃఖంలో ఉన్నాయి. ఈ స‌మ‌యంలో ప్ర‌శ్న‌ల‌తో ఆ పార్టీ నేత‌ల్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ద‌ర్శ‌కుడు ఆర్జీవీ చిత‌క్కొడుతున్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌కు తొమ్మిది ప్ర‌శ్న‌లు సంధించి …ప్ర‌శ్నిస్తాన‌న్న నాయ‌కుడినే గుక్క తిప్పుకోకుండా చేశారు.

తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా మ‌రోసారి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి కీల‌క‌మైన ప్ర‌శ్న‌ల‌ను ఆయ‌న సంధించారు. ప్ర‌తి ప్ర‌శ్న‌తో పాటు… ఔనా? అంటూ నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. తాను వేసిన ప్ర‌శ్న‌ల‌కు  చంద్ర‌బాబుని అభిమానించే వాళ్లెవ‌రైనా స‌మాధానం చెప్ప‌క‌పోతే “ఔను” అని అనుకోవాల్సి వుంటుంద‌ని ఆయ‌న స్వీట్ వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై చేసుకున్న ఒప్పందం బోగస్‌…అవునా? అనే మొద‌టి ప్ర‌శ్న‌తో మొద‌లై … ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబు గారి చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో , అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అనేక షెల్‌ కంపెనీలు, నిందితులైన యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని  ED చెప్తోంది. …అవునా ? అని చివ‌రి ప్ర‌శ్న‌ను సంధించారు. అలాగే ఒక వేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు? అని చివ‌రి ప్ర‌శ్న‌లో నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

ఆర్జీవీ వేసిన ప్ర‌తి ప్ర‌శ్న కీల‌క‌మైందే. అంద‌రూ రోజూ మాట్లాడుకున్న‌వే అయిన‌ప్ప‌టికీ, టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను ఓ రేంజ్‌లో ఆడుకునే ద‌ర్శ‌కుడిగా ఆర్జీవీకి గుర్తింపు వుంది. దీంతో ఆయ‌న వేసిన ప్ర‌శ్న‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. త‌న 12 ప్ర‌శ్న‌ల‌కు స్పందించ‌క‌పోతే అన్నింటికి ఔననే స‌మాధానం ఇచ్చిన‌ట్టే అని త‌న‌కు తానుగా ఆర్జీవీ ప్ర‌క‌టించ‌డం విశేషం. బాబుకు అనుకూలంగా ఎల్లో మీడియా ఎంత మందితో మాట్లాడించినా, ఆర్జీవీ నిల‌దీస్తే ఆ కిక్కే వేర‌బ్బా.