ప‌వ‌న్‌, నాగ‌బాబును ఆ ద‌ర్శ‌కుడు ఓ రేంజ్‌లో ఏడ్పిస్తున్నాడే!

మెగా బ్ర‌ద‌ర్స్‌కు తాను అభిమాని అంటూనే ముఖ్యంగా ప‌వ‌న్‌, నాగ‌బాబును ఓ ద‌ర్శ‌కుడు ఏడ్పిస్తున్నారు. ఆ ద‌ర్శ‌కుడే రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ప‌వ‌న్‌, నాగ‌బాబుల‌ను వ‌ర్మ జ‌ల‌గ‌లా ప‌ట్టుకుని వేధిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అన్న‌ద‌మ్ము…

మెగా బ్ర‌ద‌ర్స్‌కు తాను అభిమాని అంటూనే ముఖ్యంగా ప‌వ‌న్‌, నాగ‌బాబును ఓ ద‌ర్శ‌కుడు ఏడ్పిస్తున్నారు. ఆ ద‌ర్శ‌కుడే రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ప‌వ‌న్‌, నాగ‌బాబుల‌ను వ‌ర్మ జ‌ల‌గ‌లా ప‌ట్టుకుని వేధిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అన్న‌ద‌మ్ము లిద్ద‌రినీ ర్యాగింగ్ చేస్తున్నారు. టీడీపీతో పొత్తు వుంటుంద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంద‌ర్భంలో రామ్‌గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ తీవ్ర సంచ‌ల‌న‌మైంది.

“కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు, కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు” అంటూ వ‌ర్మ చేసిన ట్వీట్ జ‌న‌సేన‌ను వెంటాడుతూ వేధిస్తోంది. దీన్ని ఆ పార్టీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. వ‌ర్మ‌ను నాగ‌బాబు తిట్టిపోశారు. ఈ నేప‌థ్యంలో సుతిమెత్త‌గానే నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌కు వ‌ర్మ త‌లంటారు. తాజాగా ట్విట‌ర్‌లో ఆయ‌న ఓ వీడియో షేర్ చేశారు.

వ‌ర్మ ఏమ‌న్నారంటే…ప‌వ‌న్‌, ఆయ‌న అన్న చిరంజీవికి కొణిదెల నాగ‌బాబు ఇంపార్టెంట్ అయ్యిండొచ్చ‌న్నారు. కానీ త‌న‌కు కాద‌ని తేల్చి చెప్పారు. జ‌న‌సేన మీద తాను చేసిన ట్వీట్లు కేవ‌లం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానిగా చేసానన్నారు. అది అర్థం కాక‌పోవ‌డం త‌న‌ దుర‌దృష్టం, అంత‌క‌న్నా ఎక్కువ ప‌వ‌న్‌క‌ల్యాణ్ దురదృష్టమ‌ని దెప్పి పొడిచారు. ఎందుకంటే కేవ‌లం త‌న అన్న‌య్య కాబ‌ట్టి ఇలాంటి స‌ల‌హాదారుల‌ను మాత్ర‌మే పెట్టుకుంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఔట్‌క‌మ్ అనేది ఏందో జ‌న‌మే చెబుతార‌ని మాట‌ల‌తో గుచ్చారు.