వాళ్లంతా పవన్ తొత్తులు.. నిప్పు రాజేసిన వర్మ

ఆన్ లైన్లో పవర్ స్టార్ సినిమా విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ.. వర్మ దూకుడు మరింత పెరిగింది. ట్రైలర్ విడుదల చేసి దాదాపు అందరితో చీవాట్లు తింటున్న వర్మ.. టీవీ స్టుడియోల చుట్టూ తిరిగి ఇంటర్వ్యూలిస్తూ…

ఆన్ లైన్లో పవర్ స్టార్ సినిమా విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ.. వర్మ దూకుడు మరింత పెరిగింది. ట్రైలర్ విడుదల చేసి దాదాపు అందరితో చీవాట్లు తింటున్న వర్మ.. టీవీ స్టుడియోల చుట్టూ తిరిగి ఇంటర్వ్యూలిస్తూ మరింతగా సెగ రగులుస్తున్నారు. పవర్ స్టార్ సినిమా విషయంలో వర్మని కుక్కతో పోలుస్తూ హీరో నిఖిల్ ఓ కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ శిఖరం అయితే దానిముందు మొరిగే కుక్కలాంటోడు వర్మ అంటూ పరోక్షంగా ఓ రేంజ్ లో వేసుకున్నాడు. ఆ కామెంట్ ఎంతమందికి చేరిందో తెలియదు కానీ, దానికి వర్మ ఇచ్చిన కౌంటర్ మాత్రం మరింతగా వైరల్ అవుతోంది.

“నిఖిల్ కావొచ్చు, కికిల్ కావొచ్చు.. ఆయన పెద్ద స్టార్ కావచ్చు కానీ నాకాయన తెలియదు” అంటూ తనదైన స్టైల్ లో నిఖిల్ పై సెటైర్ వేశాడు వర్మ. ఇలాంటి వారంతా పవన్ కల్యాణ్ తొత్తులు, బానిసలు, ఆయన దృష్టిలో పడటానికి ఏవేవో మాట్లాడుతుంటారు, అలాంటి వాటన్నిటినీ నేను పట్టించుకోను అంటూ తేలిగ్గా తీసిపడేశారు. నిఖిల్ తో మొదలు పెట్టి.. ఇంకా చాలామందినే ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశాడు వర్మ.

పవన్ కల్యాణ్ ని పొగిడే ప్రతి ఆర్టిస్ట్ ని పరోక్షంగా బానిసలంటూ సెటైర్ వేశారు. పవన్ కల్యాణే సైలెంట్ గా ఉన్న సమయంలో.. వీరికి ఏంపని అనేది వర్మ వాదన. పవన్ గురించి ఎవరు మద్దతుగా మాట్లాడినా, వారంతా పవన్ దృష్టిలో పడటానికే అలా చేస్తున్నారని, ఏదో ఒక లాభం చూసుకునే పవన్ కి మద్దతిస్తున్నారంటూ తేల్చిపారేశారు వర్మ. తొత్తులు, బానిసలు అంటూ పెద్ద పెద్ద మాటలే అన్నారు కాబట్టి.. ఇండస్ట్రీ నుంచి ఇకపై ఎవరు ఈ సినిమాపై రియాక్ట్ అవ్వాలన్నా కాస్త ముందు వెనకా ఆలోచిస్తారు.

ఈ వ్యవహారంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా మౌనంగా ఉండటం మెగా ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేస్తోంది. నాగబాబుకి కూడా పవర్ స్టార్ సినిమా ట్రైలర్ లో భాగం ఇచ్చిన వర్మ, అన్నయ్యని, తమ్ముడ్ని తిడితే ఒప్పుకోననే ఎపిసోడ్ పెట్టారు. వారు తిట్టే తిట్ల కంటే.. ఈయన రియాక్షన్ ఎక్కువగా ఉందనే విషయాన్ని తమ్ముడి నోటి వెంటే చెప్పించారు. పవన్ ని ఎవరైనా తిడితే.. దాని ప్రభావం ఎంతుంటుందో తెలియదు కానీ.. దానికి కవరింగ్ గా వచ్చే స్టేట్ మెంట్లు మాత్రం ఆ తిట్లని మరింతగా జనాల్లోకి తీసుకెళ్తాయనేది మాత్రం వాస్తవం.

ఈ వాస్తవం తెలిసే.. మెగా కాంపౌండ్ ఈ సినిమా వ్యవహారంలో సైలెంట్ గా ఉంది. అలా రిలీజై, ఇలా మాయమైపోయే సినిమాకి అనవసరంగా ప్రచారం కల్పించడం ఎందుకనేది మెగా ఫ్యామిలీ ఆలోచన. అయితే వర్మ మాత్రం సైలెంట్ గా లేరు.. వివాదాల నిప్పు రాజేస్తూనే ఉన్నారు. 

ఆర్జీవీ చాలా తెలివైనోడు