వారాహి యాత్ర ప్రారంభమైనప్పటికీ, పవన్‌కల్యాణ్ వ్యవహార శైలిపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. వారాహి యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో కులాలు, మతాల పేరుతో యువతను పవన్ రెచ్చగొడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయ పంథాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేశారు.
పవన్ వ్యవహారశైలిని ఆయన తూర్పారపట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్‌ను ట్వీట్‌తో చితక్కొట్టారంటే అతిశయోక్తి కాదు. ఆ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారంలో కొస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం వొలిచేస్తా లాంటి హింసాత్మకమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎవరూ అనుండరు. హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా. ఇంకో విషయమేంటంటే అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా?
ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్‌కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రబోధించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం.
ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకొచ్చే ఆ యువకులు భవిష్యత్‌లో ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ పవన్‌కల్యాణ్‌కే తెలియాలి. పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్ లో పిల్లల తో పాటు టీవీ చూస్తుండగా” అని ఆర్జీవీ ఆవేదన, ఆగ్రహంతో కూడిన స్పందన తెలియజేశారు.
రాంగోపాల్ వర్మ అభిప్రాయాలే చాలా మందిలో ఉన్నాయి. అయితే వాటిని వెల్లడించలేదు. పవన్ రాజకీయ పంథాపై పౌర సమాజ స్పందనను ఆర్జీవీ ట్వీట్ ప్రతిబింబిస్తోంది. వర్మ ప్రశ్నించినట్టుగా యువతను ఏం చేయాలని పవన్ అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. వర్మ ట్వీట్ పవన్ చెంప చెళ్లుమనిపించేలా వుంది.