పవన్‌కల్యాణ్ ఒన్, టూ, త్రీ అంటూ పలువురు మహిళలకు మొగడయ్యారు. కానీ రాజకీయాల్లో ఆయన పాలిట మొగుడొకడొచ్చారు. ఆయనే ముద్రగడ పద్మనాభం. ముద్రగడ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాపుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడే నాయకుడిగా, రాజకీయాల్లో నిజాయతీకి మారుపేరుగా ఆయన గురించి చెప్పుకుంటారు.
వ్యక్తిగతంగా సౌమ్యుడైన ముద్రగడ పద్మనాభానికే పవన్ కోపం తెప్పించారంటే, జనసేనాని నైజం ఏంటో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. తనలా చంద్రబాబునాయుడి పల్లకీ మోయని వారంతా శత్రువుల కిందే పవన్ జమ కట్టారు. ఈ క్రమంలో గతంలో తన దత్త తండ్రి చంద్రబాబునాయుడు కాపులను బీసీల్లో చేరుస్తాననే హామీపై నిగ్గదీసిన ముద్రగడపై పవన్ కక్ష పెంచుకున్నట్టు ఆయన విమర్శలు తెలియజేస్తున్నారు.
గతంలో చంద్రబాబునాయుడిని కాపుల రిజర్వేషన్‌పై ప్రశ్నించిన ఉద్యమ నాయకులు, నేడు సీఎం జగన్‌ను ఎందుకు నిలదీయలేదని పవన్‌కల్యాణ్ ప్రశ్నించడం ముద్రగడకు కోపం తెప్పించింది. వైఎస్ జగన్ ఎక్కడా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇవ్వలేదు. పైపెచ్చు కాపులు మెండుగా ఉండే గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా, కాపుల రిజర్వేషన్ తన చేతల్లో లేని అంశమని తేల్చి చెప్పారు. అందుకే ముద్రగడ కూడా నిలదీయలేని పరిస్థితి.
హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబుపై కాపుల్లో వ్యతిరేకత పెంచి, టీడీపీ ఘోర పరాజయానికి ముద్రగడ కారణమనే అక్కసు పవన్ మనసులో వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముద్రగడపై పవన్ పరోక్ష విమర్శలు చేశారు. తనపై విమర్శలను ముద్రగడ ఊరికే వదిలిపెట్టలేదు. పవన్‌కు బహిరంగ లేఖ రాశారు. పవన్ వాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడ్డాన్ని ముద్రగడ మొదటి లేఖలో తప్పు పట్టారు.
దీంతో జనసేన కార్యకర్తలు, నాయకులు, పవన్ అభిమానులకు కోపం వచ్చింది. ముద్రగడను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తనకెందుకులే అని వెనక్కి తగ్గకపోగా, మరింతగా రెచ్చిపోయారు. ఘాటైన పదాలతో పవన్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ఈ దఫా తనతో పోటీకి పిఠాపురంలో రావాలని ముద్రగడ సవాల్ విసిరారు. పవన్‌కు తన మార్క్ వార్నింగ్‌ను ముద్రగడ ఇవ్వడం విశేషం.
“మీ మెస్సేజ్‌లకు భయపడి లొంగుబాటుకు వస్తానని అనుకుంటున్నారామో, అది ఈ జన్మకు జరగదు. నాపై అసభ్య పోస్టులు పెట్టించడాన్ని మీరు పెద్ద హీరో అనుకుంటున్నారు. సినిమాల్లో తప్ప రాజకీయాల్లో మీరు హీరో కాదని గ్రహించండి. గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. దమ్ము, ధైర్యం వుంటే మీరు తిట్టండి. గోచీ, మొలతాడు ఉన్నవారితో నేను సమాధానం చెప్పించగలను. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో అనుబంధంపై మీ అభిమానులతో తిట్టిస్తున్నారు. డోంట్ కేర్. నేనేమీ మీ బానిస కాదు…కాదు. మీ మోచేతి కింది నీళ్లు తాగడం లేదు. తాగను కూడా. ఎన్నికల బరిలో వుండాలా? వద్దా? అనుకుంటున్న సమయంలో …మీరు, జనసైనికులు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహం నాలో వచ్చి యుద్ధానికి రెడీ అవ్వాలన్న వాతావరణం కల్పించినందుకు చాలా సంతోషం” అని రెండో బహిరంగ లేఖలో పవన్‌కు చీవాట్లు పెట్టారు.
పవన్‌కల్యాణ్, ఆయన అభిమానుల నోరు మంచిది కాదని, దుష్టులకు దూరంగా వుండాలనే ఉద్దేశంతో జనసేన గురించి ఎవరూ పట్టించుకోరు. పొరపాటున ఎవరైనా ఒక మాట అంటే… అల్లరి గుంపంతా మూకుమ్మడిగా దాడి చేస్తుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. కాపు ఉద్యమనేత అయిన ముద్రగడ పద్మనాభాన్ని కూడా పవన్‌కల్యాణ్ అలాగే భయపెట్టి లొంగతీసుకోవాలని వ్యూహం పన్నారు.
అయితే ఆయన నిజాయతీ ముందు, పవన్ ఆగడాలేవీ పని చేయలేదు. పైగా ముద్రగడ పద్మనాభం మరింత తీవ్రంగా ఎదురు దాడికి దిగడంతో పవన్‌కు దిక్కుతోచని స్థితి.