మొదట్లో వర్మ సినిమాలు ఆకట్టుకునేవి, దాంతో పాటు వివాదాన్ని రేపేవి. అయితే ఆ తర్వాత వర్మ సినిమాలను కేవలం వివాదాలను రేపి వార్తల్లో ఉండటానికే ప్రకటిస్తూ ఉన్నాడు. అలాంటి సినిమాల్లో చాలావరకూ ప్రకటనలకే పరిమితం అవుతూ ఉంటాయి.
కొన్ని మాత్రం అడపాదడపా తెరకెక్కుతూ ఉంటాయి. ఏదోలా కొన్నిరోజుల పాటు హడావుడి చేయడమే వర్మ పని. అందులో భాగంగా మరో సినిమాను వర్మ ప్రకటించాడు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆ టైటిల్ ను అనౌన్స్ చేశాడు వర్మ.''కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'' అంటూ వర్మ టైటిల్ ప్రకటించాడు.
దానికి ఏం జస్టిఫికేషన్ ఉందో వర్మకే తెలియాలి. ఆ సంగతలా ఉంటే.. ఆ సినిమాకు సంబంధించి ట్వీట్ చేశాడు ఆర్జీవీ. తనది వివాదాస్పద సినిమా కాదని వర్మ ప్రకటించుకుంటున్నాడు.
''The most non controversial film “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ” 1st Song trailer release Tmrw Friday 9th at 9 Am'' అంటూ ఈ దర్శకుడు ట్వీట్ చేశాడు. కులాల మధ్యన రగడను రేపేలా ఉన్న ఈ టైటిల్ తో వర్మ ఎంతవరకూ వెళ్తాడో, ఏం రచ్చ రేపుతాడో!