తన భర్త చివరి రోజుల్లో కలలు గన్న అంశం గురించి వివరించారు నీతూ కపూర్. తమ తనయుడు రణ్ బీర్ పెళ్లి గురించి ఆయన కలలు కన్నారని ఆమె చెప్పింది. రిషి కపూర్ చివరి రోజుల గురించి ఆమె వివరించారు. పెషావరీ స్టైల్లో పెళ్లి కొడుకుగా రణ్ బీర్ గుర్రం ఎక్కితే చూడాలని రిషి కలలు గన్నారని ఆమె అన్నారు. అయితే ఆ కల నెరవేరకముందే రిషి భౌతికంగా దూరం అయ్యారు. రిషి కపూర్ మరణించి తర్వాత కూడా రణ్ బీర్ పెళ్లికి అడుగులేవీ ముందుకు పడకపోవడం గమనార్హం.
రణ్ బీర్ పెళ్లి గురించి చర్చ ఈ నాటిది కూడా కాదు. హీరోయిన్లతో డేటింగ్, లవ్, లివింగ్ రిలేషన్షిప్ అంటూ రణ్ బీర్ క్రమం తప్పకుండా వార్తల్లో ఉంటున్నాడు కూడా. అయితే.. ఇప్పటికీ బ్యాచిలరే. గతంలో కత్రినాకైఫ్ తో రణ్ బీర్ వ్యవహారం చాలా కాలం పాటు సాగింది.
వీరిద్దరూ ఒక ఇంట్లో సహజీవనం చేసిన వార్తలు కూడా వచ్చాయి. ఇక పెళ్లే అనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆఖర్లో కథ మారింది. కత్రినా, రణ్ బీర్ ల బ్రేకప్ జరిగింది. ఎవరికి వారయ్యారు. తమ లవ్ నెస్ట్ నుంచి చెరో వైపు ఎగిరిపోయారు.
ఇక ఇప్పుడు కూడా రణ్ బీర్ కు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈమె కూడా స్టార్ హీరోయినే. రణ్ బీర్, అలియా భట్ ల ప్రేమ కథ కొనసాగుతూ ఉంది. వీరు కూడా సహజీవనం వరకూ వచ్చారట. ఆ మధ్య పెళ్లి అనే ఊహాగానాలు వచ్చాయి, అయితే అవేవీ నిజం కాలేదు. మరి అలియాతో అయినా రణ్ బీర్ పెళ్లి గుర్రం ఎక్కుతాడా? అనేది ఇప్పుడప్పుడే ఎవరూ చెప్పలేని అంశం.
గతంలో కత్రినాతో ఇతడి స్టోరీ చాలా ఘాటుగా సాగి, చివరకు యాంటీ క్లైమాక్స్ వచ్చింది. ఆ కథ రీత్యా అలియాతో అయినా రణ్ బీర్ సెటిలవుతాడనుకోలేరెవరూ. తన భర్త కల గురించి నీతూ ఇప్పుడు మీడియాతో కూడా ఓపెనప్ అవుతున్నారు. మరి ఈ విషయం రణ్ బీర్ కు అర్థమయ్యేనా!