సూపర్‌స్టార్ మహేశ్‌బాబును వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశంసలతో ముంచెత్తారు. మహేశ్‌బాబు కుటుంబంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. మహేశ్ తండ్రి , సీనియర్ హీరో కృష్ణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌తో ఆత్మీయ సంబంధాలున్నాయి.
ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు సేవా కార్యక్రమాలకు ముగ్ధురాలైన రోజా ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. చిన్నారుల గుండె జబ్బుల ఆపరేషన్లకు హీరో మహేశ్‌బాబు తోడ్పాటు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్‌బాబు ఓ ఫౌండేషన్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఇదే రోజా ప్రశంసలకు కారణమైంది.
“చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నాను” అంటూ ఓ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా మహేశ్‌బాబు హీరో అనిపించుకు న్నారని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వివాదాలకు దూరంగా, సేవా కార్యక్రమాలకు దగ్గరగా ఉండే హీరో ఎవరంటే మహేశ్‌బాబు పేరే వినిపిస్తుందని పలువురి అభిప్రాయం. మహేశ్‌బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీ తరపున గుంటూరు నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ మహేశ్ మాత్రం రాజకీయాలకు అతీతంగా అందరితో సఖ్యతగా ఉంటారు.