రొమాన్స్ చేయడం ఈజీ అంటున్న హీరోయిన్

కొందరు యాక్షన్ బాగా చేస్తారు. మరికొందరు కామెడీ బాగా చేస్తారు. ఇంకొందరు అద్భుతంగా డ్రామా పండిస్తారు. మరి హీరోయిన్ రాశిఖన్నాకు ఏదిష్టం. తనకు రొమాన్స్ అంటే ఇష్టం అంటోంది ఈ బ్యూటీ. హీరోలతో రొమాన్స్…

కొందరు యాక్షన్ బాగా చేస్తారు. మరికొందరు కామెడీ బాగా చేస్తారు. ఇంకొందరు అద్భుతంగా డ్రామా పండిస్తారు. మరి హీరోయిన్ రాశిఖన్నాకు ఏదిష్టం. తనకు రొమాన్స్ అంటే ఇష్టం అంటోంది ఈ బ్యూటీ. హీరోలతో రొమాన్స్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని, ఎందుకంటే అది చాలా తేలికైన పని అని చెబుతోంది.

“నా దృష్టిలో కామెడీ చేయడం చాలా కష్టం. మన కామెడీ టైమింగ్ ఎదురుగా ఉన్న యాక్టర్ రియాక్షన్ పై ఆధారపడి ఉంటుంది. అదే రొమాన్స్ విషయానికొస్తే, అది చాలా తేలికైన పని. హీరోలతో రొమాంటిక్ సీన్లలో నటించడం నా దృష్టిలో చాలా ఈజీ. ప్రస్తుతం కామెడీ చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. రొమాన్స్ చేసి బోర్ కొట్టేసింది.”

ఇలా నటనలో తనకు ఇష్టమైన ఎలిమెంట్ ను బయటపెట్టింది రాశిఖన్నా. పక్కా కమర్షియల్ సినిమాలో కామెడీ రోల్ పోషించిన ఈ బ్యూటీ.. తన కోసం ప్రత్యేకంగా కామిక్ రోల్స్ రావడం ఆనందంగా ఉందంటోంది. ప్రస్తుత హీరోయిన్లలో కామెడీ చేయగల హీరోయిన్ గా తనకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందంటోంది.

“కామెడీ రోల్స్ నాకు గుర్తింపు తెస్తున్నాయి. కానీ అవకాశం వస్తే యాక్షన్ మూవీ చేస్తాను. అనుష్క చేసిన వారియర్ ప్రిన్స్ లాంటి పాత్రలు చేయాలని ఉంది. ఇక యాక్షన్ సినిమాల విషయానికొస్తే మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ తరహాలో ఓ యాక్షన్ మూవీ చేయాలని ఉంది”

పక్కా కమర్షియల్ సినిమాలో తనలోని కామెడీ యాంగిల్ ను నెక్ట్స్ లెవెల్లో చూస్తారని చెబుతోంది రాశిఖన్నా. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా, ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.