ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలపైనే ఉంది. ఈ రెండు సినిమాలు మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు జనం. వీటిలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రాజమౌళి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పట్లో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఉద్దేశం లేదని, వైద్యులు చెప్పిన ప్రకారం నడుచుకుంటామని తేల్చేశాడు. ఇప్పుడు కొరటాల కూడా ఆచార్య సినిమాపై స్పందించాడు. దాదాపు రాజమౌళి దారిలోనే రియాక్ట్ అయ్యాడు.
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఆచార్య షూటింగ్ ను పునఃప్రారంభించడం సాధ్యం కాదని తేల్చేశాడు కొరటాల. తన సినిమా షూటింగ్ కు కనీసం రోజుకు 150 మంది సిబ్బంది అవసరం అవుతారని.. 30-40 మంది సిబ్బందితో వర్క్ చేయడం తనవల్ల కాదని చెప్పేశాడు.
యూనిట్ లో సిబ్బంది అంతా క్లోజ్ గా వర్క్ చేయాల్సి ఉంటుందని.. ఉన్న సిబ్బందిలో పెద్ద వాళ్లను, ఆల్రెడీ ఆరోగ్య సమస్యలున్న వాళ్లను తొలిగించడం చాలా పెద్ద ప్రక్రియ అంటున్నాడు కొరటాల. ఇవన్నీ పక్కనపెడితే.. కరోనాను దాటి షూటింగ్ చేసేంత ధైర్యం రావాలని, యూనిట్ లో ఆ ధైర్యం వచ్చేంతవరకు షూటింగ్ మొదలుపెట్టమని అంటున్నాడు.
ఓవరాల్ గా చూసుకుంటే.. ఇప్పట్లో ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు సెట్స్ పైకి రావనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రారంభంకావడానికి కనీసం మరో 2 నెలల సమయం పట్టేలా ఉంది.