టాలీవుడ్ జనాలు, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే భారీ రేట్లకు మార్కెట్ అయిపోయిన సినిమా ఇది. కరోనాకు ముందు ఈ సినిమాను 2021 జనవరిలో విడుదల అని ప్రకటించారు. అప్పటికే ప్రకటించిన 2020 సమ్మర్ డేట్ ను వదిలేసారు. అయితే కరోనా నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడబోతోందని, కొద్ది రోజుల కిందటే గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అధికారికంగా ఇంకా బయటకు రావాల్సి వుంది.
ఇప్పుడు ఇదే విషయంలో మరో ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఏమిటంటే 2021 ఏప్రియల్ 28న ఆర్ఆర్ఆర్ విడుదల అన్నది లేటెస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలా అయితే సినిమా మేకింగ్ కు మరో రెండు నెలలు గ్యాప్ దొరుకుతుంది. కరోనా కారణంగా వచ్చిన రెండు నెలల టైమ్ నష్టం అక్కడికి సరిపోతుంది.
ఆర్ఆర్ఆర్ రెండు నెలలు వెనక్క జరిగితే టాలీవుడ్ కు మంచిదే. ఎందుకంటే 2021 సంక్రాంతికి కనీసం రెండు మూడు సినిమాలు రెడీకావచ్చు. మెగాస్టార్ ఆచార్య, ప్రభాస్ రాథేశ్యామ్ ఆ ప్లేస్ లోకి రావచ్చు. అలాగే బాలయ్య బోయపాటి సినిమా కూడా వుంది. ఇవి కాకుంటే ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతాయి. అవి ఫిబ్రవరిలో రావచ్చు. అలాగే ఆర్ఆర్ ఏప్రియల్ ను ఛూజ్ చేసకుంటే మే నెలను మరి కొన్ని సినిమాలు ఫిక్స్ చేసుకుంటాయి.
లాక్ డౌన్ ఎత్తివేయగానే దర్శకుడు రాజమౌళి మీడియా ముందుకు వచ్చి,. అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది.