అస‌లే ‘మందు’ మంత్రి…ఆపై నోరు జారి..

ముస్లింల‌పై నోరుజారి…ఆ త‌ర్వాత త‌ప్పైంద‌ని క్ష‌మించాల‌ని ఆ మంత్రివ‌ర్యులు వేడుకున్నారు. అందులోనూ ఆయ‌న ‘మందు’  (ఎక్సైజ్ ) మంత్రిత్వ‌శాఖ నిర్వ‌హిస్తున్నారు. ముస్లింల‌పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ఉప ముఖ్య‌మంత్రి కూడా అయిన నారాయ‌ణ…

ముస్లింల‌పై నోరుజారి…ఆ త‌ర్వాత త‌ప్పైంద‌ని క్ష‌మించాల‌ని ఆ మంత్రివ‌ర్యులు వేడుకున్నారు. అందులోనూ ఆయ‌న ‘మందు’  (ఎక్సైజ్ ) మంత్రిత్వ‌శాఖ నిర్వ‌హిస్తున్నారు. ముస్లింల‌పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు ఉప ముఖ్య‌మంత్రి కూడా అయిన నారాయ‌ణ స్వామి వెల్ల‌డించారు.

అస‌లేం జ‌రిగిందంటే…ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాధిగ్ర‌స్తులు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ముస్లింల‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఢిల్లీ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వాళ్ల నుంచే క‌రోనా వ్యాప్తి పెరిగిందంటూ…అందుకు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అయింది. అది ఫేక్ వీడియో అని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ఈ విష‌యాలేవీ తెలియ‌ని నారాయ‌ణ‌స్వామి ముస్లింల‌పై నోరు జారారు.

‘‘ఐసోలేషన్‌కు తీసుకెళ్లిన ముస్లింలు వైద్యులకు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు సహకరించాలి. ముస్లింలు ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వ్యాప్తి చేసినట్లు అనిపిస్తోందని, దీనికి సంబంధించి కూడా వీడియోలు వచ్చాయి’’ అని ఆయ‌న విలేక‌రుల‌తో అన్నారు.

సాక్ష్యాత్తు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే ఇటీవ‌ల క‌రోనా వ్యాప్తికి ఒక మ‌తం వాళ్ల‌ని నిందించ‌వ‌ద్ద‌ని సూచించారు. అలాంటిది జ‌గ‌న్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉంటూ, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ మంత్రిత్వశాఖ బాధ్య‌త‌లు చూస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయ‌ణ‌స్వామి మాట్లాడ్డం వివాదాస్ప‌ద‌మైంది.

ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన నారాయ‌ణ‌స్వామి స్పందిస్తూ త‌న మాట‌లు ఇబ్బంది క‌లిగించి ఉంటే క్ష‌మించాల‌ని ముస్లింల‌ను కోరారు. ముస్లింల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా తానెక్క‌డా మాట్లాడ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ముస్లింలంటే త‌న‌కు అపార గౌర‌వ‌మ‌ని, తాను మాట్లాడిన మాట‌ల‌ను బేష‌ర‌తుగా వెనక్కి తీసుకుంటాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అలాగే అల్లా ద‌య‌తో దేశం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారి వీలైనంత త్వ‌ర‌గా వెళ్లిపోవాల‌ని తాను ప్రార్థిస్తున్న‌ట్టు నారాయ‌ణ‌స్వామి అన్నారు.

రోజా ఆవకాయ.. చూస్తేనే నోరూరుతుంది